అన్వేషించండి

Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారం రద్దు - కారణాలివే!

Pawan Kalyan campaign: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొనడం లేదు. ఆయన పర్యటన రద్దు అయినట్లుగా ప్రకటించారు.

Pawan Kalyan campaign in Telangana municipal elections cancelled:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన అభ్యర్థుల తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించాల్సిన ప్రచార పర్యటనలు రద్దు అయ్యాయి. షెడ్యూల్ ప్రకారం ఆయన తెలంగాణలోని పలు కీలక మున్సిపాలిటీల్లో  శని, ఆదివారాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొనాల్సి ఉంది. బీజేపీ తరపునప్రచారం చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ పర్యటనలు వాయిదా పడటం వెనుక అటు రాజకీయ, ఇటు పరిపాలనా పరమైన కారణాలు ఉన్నట్లు సమాచారం.

 ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న అధికారిక బాధ్యతలు, కీలక సమీక్షా సమావేశాల వల్ల సమయం కేటాయించడం కుదరలేదని తెలుస్తోంది.  ఏపీలో పంచాయతీ రాజ్స గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి కొన్ని అత్యవసర ప్రాజెక్టుల తుది గడువు ఉండటం, అలాగే సనాతన ధర్మ రక్షణకు సంబంధించి ఆయన చేపట్టిన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల బిజీ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.  అలాగే భారీ జనసందోహం వచ్చే అవకాశం ఉండటంతో, భద్రతా ఏర్పాట్లు , ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని స్థానిక యంత్రాంగం నుంచి అనుమతుల విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం.

అదే సమయంలో రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు పవన్ కల్యాణ్ రావడాన్ని కాంగ్రెస్  నేతలు తీవ్రంగా విమర్శించారు. ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ ప్రయోజనాల విషయంలో స్పష్టత లేని పవన్.. ఇక్కడ ఏ ముఖం పెట్టుకుని ప్రచారం చేస్తారని వారు ప్రశ్నించారు. గతంలో తెలంగాణను అవమానించారని ఆరోపించారు.  ఈ విమర్శలపై జనసేన గట్టిగానే స్పందించింది. పవన్ కల్యాణ్ ఒక జాతీయ భావజాలం ఉన్న నాయకుడని, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కోరుకునే వ్యక్తిని విమర్శించడం సరికాదని పార్టీ నేతలు హితవు పలికారు. కేవలం రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికే ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.                                 

ఇక ఈ విమర్శల వల్లే ప్రచారం ఆగిపోయిందా అన్న చర్చపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విమర్శలు రావడం సహజమే అయినా, అవే ప్రచారం రద్దుకు ప్రధాన కారణం కాదని జనసేన వర్గాలు అంటున్నాయి. ఏపీలో పాలనాపరమైన ఒత్తిడి, భద్రతా కారణాలు,   పొత్తులో భాగంగా క్షేత్రస్థాయిలో బీజేపీ-జనసేన క్యాడర్ మధ్య సమన్వయ లోపం వంటి అంశాలే పర్యటన రద్దుకు దారితీసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల విమర్శలకు భయపడి వెనక్కి తగ్గే నాయకుడు పవన్ కల్యాణ్ కాదని, కేవలం అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తానికి పవన్ ప్రచారం మాత్రం ఆగిపోయింది.                              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
Congress MLA Anirudh Reddy: సారా పురాణం వినిపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి - తెర వెనుక కథేంటో?
సారా పురాణం వినిపిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుథ్ రెడ్డి - తెర వెనుక కథేంటో?
Kavitha Arrest: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో హైడ్రామా! నిరవధిక దీక్ష చేస్తున్న కవిత అరెస్టు! 
Advertisement

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
వెలుగుమట్ల నిర్వాసితులకు సర్కారు తీపి కబురు! ఇందిరమ్మ ఇళ్లు, పట్టాల పంపిణీకి సిద్ధం!
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Reliance Industries: దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
దేశ ఇంధన భద్రతకు రిలయన్స్‌ భరోసా! జామ్‌నగర్‌లో రికార్డు స్థాయిలో ఎల్పీజీ ఉత్పత్తి! కేజీ డీ 6 గ్యాస్ సరఫరాలో కీలక మార్పులు!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Embed widget