Papikondalu Boat Tourism: గోదావరి పర్యాటక బోటుపై పాపికొండల అందాలను వీక్షించేందుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి భారీ వర్షాలు, గోదావరి వరదలను దృష్టిలో పెట్టుకొని ఆగస్టులో విహారయాత్రను నిలిపివేశారు. అయితే ఇప్పడు వర్షాలు, వరదలు పెద్ద ఎత్తున లేకపోవడంతో పర్యాటక బోట్లకు అనుమతి ఇచ్చారు. ఈక్రమంలోనే బుధవారం రోజు బోటులో అధికారులు పేరంటపల్లికి వెళ్లారు. యాత్ర ప్రారంభం కావడంతో పర్యాటక ప్రేమికుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బోట్లలో తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ ఉండాలని పరిమితికి మించి బోట్లలో ఎక్కించుకోకూడదని అధికారులు చెబుతున్నారు. బోట్లలో వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. నిబంధనలు పాటించని బోటు యాజమనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోట్ల లైసెన్సులు.. రద్దు చేస్తామన్నారు.