నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద జాతీయ రహదారిపై టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ, సిమెంట్ మిక్సర్ ట్యాంకర్ ఢీకొనడం వల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వంతెన ఒకవైపు బుంగా పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Adilabad Traffic Jam | కుప్టి వంతెన వద్ద లారీ, ట్యాంకర్ ఢీకొనడంతో NH-44పై రాకపోకలు స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇచ్చోడ, నేరేడిగొండ ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

- ఆదిలాబాద్ కుప్టి వంతెన వద్ద లారీలు ఢీకొని భారీ ట్రాఫిక్ జామ్.
- వన్-వే వంతెనపై ప్రమాదంతో పది కిలోమీటర్ల వాహనాలు నిలిచాయి.
- అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టగా, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో కుప్టి వంతెన సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. జాతీయ రహదారిపై టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ, మరో లారీ ఢీకొని బోల్తాపడటంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ, నేరేడిగొండ మండలాల పరిధిలోని 44వ జాతీయ రహదారి (NH-44) పై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అర్ధరాత్రి నేరేడిగొండ మండలం కుప్టి వంతెన వద్ద సిమెంట్ మిక్సర్ ట్యాంకర్, టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ వంతెనకు ఒకవైపు బుంగ పడటంతో రాకపోకలు వన్ వే లో కొనసాగుతుండగా, అదే మార్గంలో ప్రమాదం జరగడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.
లారీలు ఢీకొన్న ప్రమాదం ప్రభావంతో జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న అధికారులు వేకువజామునే సంఘటనా స్థలానికి చేరుకుని, క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అయినప్పటికీ, మార్గం వన్ వే కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అత్యవసరంగా వెళ్లాల్సిన ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇచ్చోడ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సులను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే, నేరేడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాలను నిలిపివేస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు గాయపడగా.. సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నారు.
ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు
నిర్మల్- ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులోని కొలాం ఘాట్ (ఈచ్ఛోడ-నేరేడిగొండ) ప్రాంతంలో భారీ మలుపులు, లోయల కారణంగా వాహనాలు నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు గురవుతున్నాయి. కుప్టి, సోనాల తదితర ప్రాంతాల్లోని పాత వంతెనలకు బుంగాలు పడటం, తరచూ మరమ్మతులు జరగడం వల్ల రహదారి ఇరుకుగా మారి వన్-వే విధానాన్ని అమలు చేయాల్సి వస్తోంది. ఉత్తర- దక్షిణ భారతదేశాలను కలిపే ప్రధాన రహదారి కావడం వల్ల సిమెంట్, రసాయనాలు, సరుకు రవాణా చేసే లారీలు వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలు ఏమున్నాయి..
ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు లేదా ఘాట్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులు, స్థానిక అధికారులు సూచించే కొన్ని మార్గాల వివరాలు.
ఇచ్ఛోడ - పెంబి - నిర్మల్ మార్గం
ఇచ్ఛోడ వద్ద నేషనల్ హైవే 44 (NH-44) నుంచి వైదొలిగి పెంబి, ఖానాపూర్ మీదుగా నిర్మల్ చేరుకుని తిరిగి నేషనల్ హైవే పైకి రావచ్చు. (లైట్ మోటార్ వాహనాలకు ఇది అనుకూలం).
ఆసిఫాబాద్ - మంచిర్యాల బైపాస్
మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఆదిలాబాద్ బైపాస్ వద్ద ఆసిఫాబాద్, మంచిర్యాల మీదుగా కరీంనగర్ రహదారి గుండా హైదరాబాద్ వైపు వెళ్తాయి.
ఉట్నూర్ మార్గం
ఇచ్చోడ వద్ద ట్రాఫిక్ నిలిస్తే కనుక ఉట్నూర్ - ఆసిఫాబాద్ మార్గంలో వాహనాలను మళ్లిస్తుంటారు.
Frequently Asked Questions
ఆదిలాబాద్ జిల్లాలో ట్రాఫిక్ జామ్‌కు కారణం ఏమిటి?
ట్రాఫిక్ జామ్ ఎంత దూరం విస్తరించింది, దాని ప్రభావం ఎలా ఉంది?
జాతీయ రహదారిపై ఇరువైపులా దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అత్యవసర ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తున్నారు.
ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి?
కొలాం ఘాట్ ప్రాంతంలో భారీ మలుపులు, లోయలు, పాత వంతెనలకు బుంగాలు పడటం, మరియు ఇది సిమెంట్, సరుకు రవాణా చేసే ప్రధాన రహదారి కావడం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా ప్రమాదాలు జరుగుతాయి.
ప్రమాదం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి?
ఇచ్ఛోడ - పెంబి - నిర్మల్ మార్గం, ఆసిఫాబాద్ - మంచిర్యాల బైపాస్, ఉట్నూర్ మార్గం వంటి ప్రత్యామ్నాయ దారులు అందుబాటులో ఉన్నాయి. అధికారులు మళ్లించినప్పుడు వీటిని ఉపయోగించుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























