అన్వేషించండి

Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్

Chandrapur Forest Officials Capture T2 Tigress | తూనికాకు (బీడీ ఆకులు) సేకరిస్తున్న మహిళలపై దాడి చేసి నలుగురి ప్రాణాలు తీసిన ఆడ పులిని అధికారులు మహారాష్ట్ర చంద్రాపూర్ అటవీ ప్రాంతంలో బంధించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాలుగు మహిళలను చంపిన 'టి-2' పులిని అధికారులు పట్టుకున్నారు.
  • తూనికాకులు సేకరిస్తున్న మహిళలపై పులి దాడి చేసింది.
  • ప్రత్యేక బృందాలు కెమెరాలు, సీసీటీవీ ఆధారంగా పులిని పట్టుకున్నాయి.
  • పులి పట్టుబడటంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

చంద్రపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా అటవీ ప్రాంత ప్రజలను వణికించిన 'టి-2' అనే ఆడ పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులకు చిక్కింది. ఈ ప్రాంతంలో నలుగురు మహిళలను చంపి గత కొన్ని రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఈ క్రూర మృగాన్ని గుంజవాహి అటవీ ప్రాంతంలో అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.

మూడు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో తూనికాకు (బీడీ ఆకులు) సేకరిస్తున్న మహిళా కూలీలపై ఈ పులి ఆకస్మికంగా దాడి చేసింది. ఈ ఘోర దాడిలో నలుగురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అటవీ పరిసర గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవగా, స్పందించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు పులిని బంధించేందుకు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు ట్రాప్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పులి సంచారాన్ని పక్కాగా గుర్తించి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఎట్టకేలకు పులిని మత్తుమందు ఇచ్చి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

మనుషుల్ని చంపుతున్న పులి పట్టుబడటంతో చంద్రపూర్ జిల్లా గుంజవాహి అటవీ ప్రాంత గ్రామ ప్రజలు పెద్ద గండం గడిచిందంటూ ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న 'టి-2' పులిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అటవీ శాఖ అధికారులు తదుపరి చర్యలు చేపట్టారు.Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్

 పులి దాడిలో నలుగురు తూనికాకు కూలీలు మృతి

మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని గుంజవాహి-పవన్‌పార్ ప్రాంతంలో తూనికాకులు సేకరించడానికి అడవికి వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేసింది. వారిలో నలుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. అటవీ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనకు కారణమైంది.


Tiger Trapped In Cage: నలుగురు మహిళల్ని చంపిన పులిని బంధించిన అధికారులు.. స్థానిక ప్రజలుకు బిగ్ రిలీఫ్

చంద్రపూర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఒకేసారి పులి దాడిలో నలుగురు మహిళలు మరణించడం ఇదే మొదటి ఘటన. చంద్రపూర్ జిల్లాలోనీ గుంజవాహి- పవన్‌పార్ రహదారిపై ఉన్న ఖైరిచక్ అటవీ ప్రాంతంలో ఈ పులి దాడి ఘటన జరిగింది. మృతులు భట్టి మొహల్లా వార్డ్ నెం. 1, గుంజవాహి గ్రామానికి చెందినవారని గుర్తించారు.
ఈ మృతుల పేర్లు 1) పద్యం తాత మోహర్లే - 45,
2) అనితా దాదాజీ మోహర్లే - 46,
3) సంగీత సంతోష్ చౌదరి - 40,
4) సునీత కౌశిక్ మోహర్లే - 35 లుగా గుర్తించారు. ఈ పులి దాడి ఘటన విషయం తెలుసుకున్న తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లోనూ ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు.

Frequently Asked Questions

చంద్రపూర్ జిల్లాలో ప్రజలను భయపెట్టిన 'టి-2' పులికి ఏమైంది?

'టి-2' అనే ఆడ పులిని అటవీ శాఖ అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు. ఈ పులి నలుగురు మహిళలను చంపి స్థానికులకు భయాందోళనలు సృష్టించింది.

పులి దాడిలో ఎంత మంది మహిళలు మరణించారు?

తూనికాకులు సేకరించడానికి అడవికి వెళ్లిన 13 మంది మహిళలపై పులి దాడి చేయగా, వారిలో నలుగురు మరణించారు.

పులిని ఎలా పట్టుకున్నారు?

ప్రత్యేక బృందాలు ట్రాప్ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పులి సంచారాన్ని గుర్తించి, మత్తుమందు ఇచ్చి సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

పులి దాడి ఘటన ఏ ప్రాంతంలో జరిగింది?

ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి తాలూకాలోని గుంజవాహి-పవన్‌పార్ ప్రాంతంలో, ఖైరిచక్ అటవీ ప్రాంతంలో జరిగింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Breaking News: అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
అమీర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం- మైత్రివనం వద్దే మరోసారి దుర్ఘటన
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Bigg Boss Telugu 10 : బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
బిగ్ బాస్ 10 వచ్చేస్తోంది - ఆటలో కాదు ఆటే సవాల్... సామాన్యులకు ఎంట్రీ ఉంటుందా?
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Hema Reaction : ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
ఆ కొందరు డాష్‌లకు చెబుతున్నా... జాగ్రత్తగా ఉండండి - నెగిటివ్ కామెంట్స్‌పై హేమ స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget