Nirmal Municipal Chairman: నిర్మల్‌లో భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్.. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చైర్మన్ల పూర్తి వివరాలు
నిర్మల్ మున్సిపాలిటీలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. భార్యాభర్తలే నిర్మల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు.

ఆదిలాబాద్: నిర్మల్ మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. నిర్మల్ ఛైర్ పర్సన్ గా అప్పాల కావ్య, వైస్ ఛైర్మన్ ఆమె భర్త అప్పాల గణేష్ చక్రవర్తి సోమవారం ప్రమాణం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యా భర్తలు మున్సిపల్ కీలక పదవులను దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బలపరిచిన ఈ జంట ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ గా బండారి అనూష
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా 45వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ఎన్నికలో ఆమెకు 27 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర సభ్యులు అనూషకు మద్దతు తెలపారు. వైస్ చైర్మన్ గా ఏంఐఏం పార్టీకి చెందిన మహమ్మద్ రోహిత్ నీ ఎంపిక చేశారు.
మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ గా ధరణి మధుకర్ ఎన్నికయ్యారు.

ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ గా మెంగ్రే ఆకాష్ ఎన్నికయ్యారు.

కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
మంచిర్యాల జిల్లాలోని కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. నిర్ణీత సమయం ముగిసినా అభ్యర్థులు హాజరుకాకపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు మందమర్రి తహశీల్దార్ సతీష్ కుమార్ ప్రకటించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు వేచి చూసినా కౌన్సిలర్లు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తిరిగి ఎన్నిక నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
కోరం లేకపోవడంతో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కేవలం 14 మంది సభ్యులు (బీఆర్ఎస్ - 11, ఇండిపెండెంట్ -2, ఎంఐఎం 1)మాత్రమే హాజరయ్యారు. సమావేశం రేపటికి వాయిదా పడింది.
గైర్హాజరైన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు
మరో ఇద్దరు ఇండిపెండెంట్ సభ్యులు
























