Luxettipet Municipality: ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీలో విషాదం.. లక్షెట్టిపేటలో బీజేపీ అభ్యర్థి మృతి

లక్షెట్టిపేట: ఎన్నికలకు ముందే ఓ బీజేపీ అభ్యర్థి చనిపోవడంతో మక్తల్ లో ఆ వార్డులో ఎన్నిక రద్దు కాగా, నేడు ఓట్ల లెక్కింపునకు ముందు మరో బీజేపీ అభ్యర్థి మృతిచెందారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు BJP అభ్యర్థి బత్తిని లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. నామినేషన్ వేసిన తర్వాత మూడో రోజు నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో లక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఓ వైపు ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో బిజెపి అభ్యర్థి మృతి చెందడంతో ఆమె మృతిపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)























