Jupally Krishna Rao: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామో లేదో అని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదన్నారు మంత్రి జూపల్లి. తాను కూడా మళ్లీ గెలుస్తానో లేదో తెలియదని చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "నేను హామీలు ఇవ్వను.. ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. అందుకే నేను హామీలు ఇవ్వను. నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా.. నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను.. ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా " అని మంత్రిజూపల్లి అన్నారు.