సేవ ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు నడుపుతోన్న పీఎఫ్ఐ బండారం బయటపడుతోంది. ఓ వర్గానికి చెందిన అమాయక యువకులను ఎరవేసి అనుబంధ సంస్థలను నడుపుతోంది పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా. సేవా ముసుగులో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తుందని, మరో ఎనిమిది సంస్థలు నడుపుతున్నట్లు పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఫ్రంట్ సభ్యుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.  


నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఖాదర్ ను అరెస్ట్‌తో ఆటోనగర్‌లో శిక్షకుడు అబ్దుల్ ఉగ్ర కార్యకలాపాల డొంక కదిలింది. ఈనెల 4న ఆటోనగర్ పోలీసులు దాడులు చేసి శిక్షకుడు అబ్దుల్ ఖాదర్‌ను అదుపులోకి తీసుకొని పలు పుస్తకాలు, నాన్ చాక్ లు, కత్తులతో పాటు బ్యానర్లు, సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ అరెస్టుతో ఈనెల 6న నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారంలో సమావేశమైన పీఎఫ్ఐ కీలకనేత షేక్ అబ్దుల్లాతోపాటు మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్లాను పోలీసులు ఆరెస్ట్ చేశారు. నలుగురిని కస్టడీలోకి తీసుకొని చంచల్ గూడ జైలుకు తరలించారు. వీరిని సిట్, ఎన్ఎస్ఐఏకు అప్పగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఆటోనగర్‌లో అబ్దుల్ ఖాదర్ ఇంటి వద్ద 200 మంది సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 28 మందిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు రిమాండ్ రిపోర్టులో వివిధ అంశాలను పొందుపర్చారు.


పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది. సోషల్ డెమోక్రా టిక్ పార్టీ ఆఫ్ ఇండియా (పొలిటికల్ వింగ్), క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(స్టూడెంట్ వింగ్), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్ (వోర్నెన్ వింగ్), ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (అడ్వకేట్వింగ్), రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (సోషల్ యాక్టి విటీస్ వింగ్) నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్ ఆర్గనైజన్, సోషల్ డెమోక్టిక్ ట్రేడ్ యూనియన్ సంస్థలను ఏర్పాటు చేసి కార్యక లాపాలు సాగిస్తున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.


పీఎఫ్ఐ కార్యకలాపాలు


ఓ వర్గం యువకులకు కరాటే, కుంగ్ఫూ వంటి వాటితోపాటు రాళ్లదాడి, కత్తి వినియోగంలో శిక్షణ ఇస్తారు. ఇతరులపై ద్వేషం కలిగేలా రెచ్చగొడతారు. సోషల్ వర్క్ పేరుతో విరాళాల సేకరణ, పాఠశాలలు, కళాశాలలలో తమ భావాజాలాన్ని ప్రచారం చేస్తారు. పీఎఫ్‌ఐ సభ్యుల ఇంటిపై రాళ్లు నిల్వ ఉంచి ఊరేగింపులు, నిరసన కార్యక్రమాల సందర్భంగా రాళ్లు విసిరి హింసాత్మకంగా మార్చేందుకు కుట్ర చేస్తారు. బహిరంగ సభలు, సమావేశాలు, గుంపులోకి చొరబడి దాడులు చేయడానికి శిక్షణ ఇస్తారు. నిజామాబాద్ లో 200 మందికి శిక్షణ ఇచ్చారు. వారి పూర్తి వివరాలు పోలీసులు సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.