Rishi Panchami Celebrations: మథురాల కోలాటం.. లెంగీ నృత్యాలు.. ఆదిలాబాద్ జిల్లాలో మథుర లభానల ఋషి పంచమి వేడుకలు
Rishi Panchami Celebrations of Mathura Labhanas | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తండా జ్వాలాముఖి ఆలయంలో మథురా లభానాల ఋషి పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Adilabad News | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అందునాయక్ తండాలోని జ్వాలాముఖి దేవస్థానంలో మథురా లభానాల ఋషి పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. జ్వాలాముఖి దేవి శిష్యులైన కాళుబాబా పాచూ బాబా,ల పేరిట ఈ పితృ మాసంలో ఋషి పంచమి కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుండి మథుర లభానా కులస్తులు పెద్ద ఎత్తున హాజరై తమ కులదైవాలను దర్శించుకుంటారు. అనంతరం తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం పేటి అనే వస్త్రాధారణ చేసి తలకు తలపాగా ధరించి, కాళ్లకు గజ్జలు కట్టుకొని కోలాటమాడుతూ నృత్య ప్రదర్శన చేస్తారు. ఇంతకీ మథుర లభానాలు నిర్వహించే ఈ ఋషి పంచమి వేడుకలు ఎన్ని రోజులపాటు నిర్వహిస్తారు.? రుషి పంచమి యొక్క ప్రత్యేకత ఏమిటి..? abp దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో అందునాయక్ తాండ గ్రామమిది. "ఇక్కడ అందరు" కైతి లభాన " (మధుర) తెగకు చెందిన వారు నివస్తిస్తున్నారు. ఈ" కైతి లాభాన"ల కులదైవం "జ్వాలముఖి దేవి " ఈ అందునాయక్ తండాలో 2000 సంవత్సరం ఈ జ్వాలముఖిదేవి నిర్మించారు. ఈ ఆలయంలో జ్వాలముఖిదేవితో పాటు కుడి ప్రక్కన "కాళుబాబా" మరియు ఎడమ ప్రక్కన "పాచు బాబా" విగ్రహాలున్నాయి. గత పూర్వం తమ కులదైవమైన జ్వాలముఖి దేవికి అత్యధికంగ పూజలు చేయడం వల్ల జ్వాలముఖదేవి "కాళు బాబా" కు పృత్యక్షమయి తమ కష్టాలను తీర్చిందని పూర్వీకులు చెబుతుంటారు. అప్పటి నుండి అనుకుంటు వీరంత జ్వాలముఖి దేవికి పూజలు చేస్తువస్తున్నారు.

కైతి లభానాలు, లేక మథుర లభానా అని వీరిని పిలుస్తుంటారు. వీరి ముఖ్య వృత్తి గోవులను పెంచడం వ్యవసాయం చేయడం.. ఇలా పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలను వీరి కుల పెద్దలయిన "కాళు బాబా" ఆయనతో పాటు "పాచుబాబా" లు పాటిస్తు వస్తున్న క్రమంలో వీరిని తమ దేవి శిష్యులుగా మహా ఋషులుగా భావిస్తూ ఈ పితృమాసంలో వీరి పేరిట ఋషి పంచమి కార్యక్రమం చెస్తుంటారు. లభాన కులస్తుల మహిళలు జడలపై కోప్పులను ధరిస్తారు. దిన్ని కైతీ అని అంటారు. ఇలా వారంత కైతి లభాన అని పిలువబడుతున్నారు. వీరంత దేశంలో మొత్తం ఎక్కడ ఉన్న ఈ దసరా పౌర్ణమి పంచమి రోజున ఈ ఆలయం వద్ద" జ్వాలముఖి దేవిని దర్శించుకుంటారు.

అనంతరం తమ దేవి శిష్యులు అయిన "అయిన "కాళుబాబా" పాచుబాబా" లను ధర్మించుకుంటారు. ఆపై తమ పూరతన కాలంగా వస్తున్న ఆచార వ్యవహారాలను కొనసాగిస్తూ లభానా డ్యాన్స్ చేస్తారు. దిన్ని వీరు లేంగి నృత్యం అంటారు. కొలటామాడుతూ,, పాటలు పాడుతూ ఇక్కడ సంబరాన్నింటిన సంబురాలు జరుపుకుంటారు. వీరు వాయిస్తున్న ఈ డప్పులను "నంగారా" అని అంటారు. ఇది వాయిస్తు వివిధ గ్రామాలనుండి వచ్చిన వారు నృత్యాలు చెస్తు తమకంటే బాగుండేలా ఒకరినొకరు పోటి పడుతు కళను ప్రదర్శిస్తారు. ఇలాగే మహిళలు సైతం పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. దిన్ని వీరు"జాయో జాయో" అని అంటారు. ఇలా వీరత 3 రోజుల పాటు భక్తి భావంతో "జ్వాలముఖి" సన్నిధిలో ఒక జాతరగా జరుపుకుంటారు.

ఈ ఋషి పంచమి వేడుకలకు మన రాష్ట్రంలోని కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుండి మథుర లభానలు తరలి వచ్చి తమ కులదైవమైన జ్వాలాముఖి దేవిని, దేవి శిష్యులైన కాళు బాబా,, పాచు బాబా లను ధర్మించుకుని... వేడుకల్లో పాల్గొంటారు. ప్రతి యోటా ఈ దేవస్థానంలో రాంసింగ్ మహరాజ్ ఆధ్వర్యంలో అందరు కలిసి మంచి మంచి బాటలో నడిచే అంశాలపై చర్చిస్తారు. అనంతరం వారంత పాండవులు కౌరవులు ఆడే "పాచికల ఆట ఆడతారు. ఇలా అందరు ఎంతో భక్తి భావంతో ఉంటూ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. అనంతరం తమ తమ గ్రామాలకు పయనమవుతారు. ఇలా ప్రతియేటా మథుర లభానా కులస్తులు తమ సాంప్రదాయ రీతిలో ఆచారాలకు అనుగుణంగా ఋషి పంచమి వేడుకలు జరుపుకుంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















