News
News
వీడియోలు ఆటలు
X

Nizamabad Weather: నిజామాబాద్ జిల్లాలో భానుడి భగభగలు - 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు

Nizamabad Weather: నిజామాబాద్ జిల్లాలో భానుడు భగభగా మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతుండగా.. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 

FOLLOW US: 
Share:

Nizamabad Weather: రాష్ట్రంలోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు... ఈఏడాది ఎండాకాలంలో ఇదే గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ముప్కాల్ లో  45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. వాయువ్య దిశ నుంచి గాలులు వీయడం వల్లే ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఉదయం 9 గంటల నుండే భానుడి ప్రతాపం మొదలవుతోంది. సాయంత్రం 6 గంటలైనా కాలు బయట పెట్టలేని పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తుండంతో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. జనం ఎండలకు తాళలేక ఇండ్లలోనుంచి బయటికి రావడం లేదు. జిల్లాలో సోమవారం ఏకంగా 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వాతావరణంలో నాలుగు రోజులుగా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు లేని స్థాయిలో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

మరో వారం రోజుల్లో ఎండ తీవ్రత పెరిగే అవకాశం..

రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో సాధారణం కన్నా నాలుగు నుంచి అయిదు డిగ్రీలు మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వవరించారు. భానుడి ప్రతాపానికి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వీధులన్నీ నిర్మానుషంగా మారిపోతున్నాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు జన సంచారం లేక బోసి పోతున్నాయి. సాయంత్రం 6 దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలు తీవ్రం అయిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఎండల బారీన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అవసరం ఉంటేనే బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు వడ దెబ్బకు చనిపోయారు. చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బాడీ డీ హైడ్రేషన్ కాకుండా నీరు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్యులు వివరిస్తున్నారు. దూర ప్రయాణాలు రాత్రి వేళల్లో చేయటం మంచిదని అంటున్నారు. మరో పది రోజుల పాటు ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ లో ఇలా

‘‘ఆకాశం నిర్మలంగా ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.7 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 44 శాతంగా నమోదైంది.

Published at : 16 May 2023 02:34 PM (IST) Tags: Nizamabad News Telangana News Heavy Temparature Telangana Temparature Highest Temparature in Nizamabad

సంబంధిత కథనాలు

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, చివరగా ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Todays Top 10 headlines: ఒడిశా రైలు ప్రమాద స్థలంలో భయానక వాతావరణం, జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ ఆలోచన మారిందా?

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana సీఎం కేసీఆర్ కి నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ- ప్రస్తావించిన అంశాలివే

Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు

Telangana Formation Day: రాదన్న తెలంగాణను సాధించిన ఘనుడు, పాలకుడిగా నిలిచిన కేసీఆర్- ట్విట్టర్‌లో ప్రశంసలు

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

టాప్ స్టోరీస్

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: కోరుకున్న సీట్లు రాలేదని టికెట్లు క్యాన్సిల్, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Coromandel Express Accident: రాంగ్‌ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్

Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్