Nizamabad News: నిజామాబాద్ జిల్లాలో ఉగ్రవాదుల లింకులు ఉన్న విషయం కలకలం రేపుతోంది. నిషేధిత సీమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థ పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ట్రైన‌ర్ ఖాద‌ర్ అరెస్టుతో ఈ కుట్ర బయటపడింది. పీఎఫ్ఐ అనేది తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ. పీఎఫ్ఐ ట్రైనింగ్ పేరుతో ఇతను మ‌త ఘ‌ర్షణ‌ల‌కు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. నిజామాబాద్ ఆటో న‌గ‌ర్‌లోని ఓ ఇల్లు కేంద్రంగా ఇతను శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా పోలీసులు భ‌గ్నం చేశారు. శిక్షణలో జ‌గిత్యాల, హైదరాబాద్, క‌ర్నూలు, నెల్లూరు, క‌డ‌పకు చెందిన యువకులు ఉన్నట్లు గుర్తించారు. ఖాదర్ నివాసంలో మ‌ర‌ణాయుధాలు, నిషేధిత సాహిత్యం, పుస్తకాలు దొరికాయి. మ‌త ఘర్షణ‌ల సమయంలో భౌతిక దాడులు ఎలా చేయాలనే దానిపై అతను ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.


కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పీఎఫ్ఐ సంస్థ సంచలనం సృష్టించిన కేసులకు పాల్పడినట్టుగా నిజామాబాద్ పోలీసులు గుర్తించారు. ఖాదర్ ను పోలీసులు  మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. మత ఘర్షణలను పాల్పడడడంతో పాటు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా యువకులరు శిక్షణ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. 


గతేడాది జూలైలోనూ బోధన్‌లో ఉగ్ర కదలికలు వెలుగు చూశాయి. ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయనే అనుమానంతో ఒకర్ని అప్పుడు సౌదీ అరేబియాలో అదుపులోకి తీసుకుని నేరుగా భారత్‌కు పట్టుకొచ్చారు. ఆ తర్వాత అతను బెయిల్ పై విడుదల అయ్యాడు.