Nizamabad Mayor Election: నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ హస్తగతం.. మజ్లిస్‌కు డిప్యూటీ మేయర్ పదవి
కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించింది. బీజేపీకి అధిక స్థానాలు వచ్చినా, మెజార్టీ లేకపోవడంతో మజ్లిస్ తో చేతులు కలిపి నిజామాబాద్ కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకుంది.

Nizamabad Municipal Corporation | నిజామాబాద్ కార్పొరేషన్ పీఠాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఎంఐఎంతో కలిసి నిజామాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీసీలకు మేయర్ పీఠం ఇచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజామాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ తో చేతులు కలిపిందని.. ప్రజా పాలన అందిస్తామని పేర్కొన్నారు. మేయర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ మేయర్ పదవికి ఎంఐఎంకి కేటాయించినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ అధిష్టానం నిజామాబాద్ మేయర్ గా ఉమారాణిని ఖరారు చేసింది. డిప్యూటీ మేయర్ గా ఎంఐఎంకు చెందిన సల్మా తహీన్ బాధ్యతలు చేపట్టనున్నారు. కాంగ్రెస్ వ్యూహం ఫలించడంతో నిజామాబాద్ కార్పొరేషన్ లో ఎన్నికలు లేకుండానే ఏకగీవ్రమైనట్లు అధికారులు ప్రకటించారు. 31 స్థానాలలో మెజార్టీ అవుతుంది, కాంగ్రెస్, మజ్లిస్ కలిసి సరిగ్గా 31 స్థానాలు నెగ్గడంతో అత్యధిక కార్పొరేటర్లు నెగ్గినప్పటికీ బీజేపీకి నిరాశే ఎదురైంది.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2026 ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 60 డివిజన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 28 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పార్టీల వారీగా గెలుచుకున్న సీట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి:
నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాలు 2026: మొత్తం స్థానాలు 60
బీజేపీ (BJP) 28
కాంగ్రెస్ (INC)17
ఎంఐఎం (AIMIM) 14
బీఆర్ఎస్ (BRS) 01
























