Nizamabad MP Arving comments against CM KCR and Minister KTR: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నిజామాబాద్ కు ఎందుకు వచ్చారని Dharmapuri Arvind ప్రశ్నించారు. పసుపు బోర్డు కంటే మెరుగైన బోర్డు తెచ్చామని.. రాష్ట్రంలో దొరతనాన్ని తరిమి కొడతామని తెలిపారు. కేసీఆర్ బ్రోకర్ అని, మా నాన్న డీఎస్ పెద్ద మనిషి అని తెలంగాణ సమాజానికి తెలుసంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల హామీలు ఎందుకు నెరవేర్చలేదు : ఎంపీ ప్రశ్నల వర్షం
నిజామాబాద్ కు కేసీఆర్, కేటీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ బ్రోకర్ పనులు ఎలా చేస్తారో చెప్తానంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ హామీ ఏమైందని అడిగారు. అలాగే ఇళ్ల జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామని చెప్పి; ఇప్పుడు రూ.3 లక్షలు అంటూ కొత్త డ్రామాకు తెరతీశారంటూ బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు
ఎన్నికల హామీలు తప్ప ఆచరణలో చేసింది శూన్యం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు తిన్నారని, కనుక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. తమరు డీపీఆర్ ఇస్తే. జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. మహిళా గవర్నర్ పై అసభ్య పదజాలంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూషిస్తున్నారని.. ఇదేనా బీఆర్ఎస్ సంస్కృతి అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల జీవితాలు బాగు పడ్డాయి తప్ప సామాన్య ప్రజల జీవితం మరింత దిగజారిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చేనేత జీఎస్టీలో రాష్ట్ర వాటా కట్ చేసి, ఆ తర్వాత జీఎస్టీ గురించి మాట్లాడాలని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ రేటు ఎక్కువగా ఉన్నాయని ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యానించారు.