అన్వేషించండి

Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం

Indravelli Incident | ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డలు తమ భూమి, భుక్తి, విముక్తి కోసం గళమెత్తిన రోజు ఏప్రిల్ 20, 1981. పోలీసుల కాల్పులతో అమాయకులు బలైపోయారు.

Indravelli Martyrs Memorial | ఆదిలాబాద్ జిల్లాలోని అడవి బిడ్డలు భూమి. భుక్తి.. విముక్తి... నినాదంతో తమ హక్కుల కోసం తుడుం మోగించి పోరాడిన ఈ అడవి బిడ్డలపై ఇంద్రవెల్లిలో కురిసిన తుపాకీ గుండ్ల వర్షానికి నిలువెత్తు సాక్ష్యమే ఈ ఎరుపు రంగు స్థూపం. ఈ పోరాటంలో పోలీసుల తూటాలకు 13 మంది అమాయక అడవి బిడ్డలు అమరులయ్యారు. ఈ నెత్తుటి గాయన్ని మిగిల్చిన ఘటనకు 45 ఏండ్లు గడిచాయి.

1981 ఏప్రిల్ 20న జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నది ఇంద్రవెల్లిలోని నిలువెత్తు అమరవీరుల స్మారక స్తూపం. ఆ దారి వెంట వచ్చిపోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ గిరిజన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూనే ఉన్నది.


Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం

ఆరోజు జరిగింది ఏమిటి? ఎందుకు 13 మంది అమరులయ్యారంటే..
ఆదివాసీ గిరిజనులు చట్టబద్ధమైన హక్కుల కోసం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి గిరిజనులు పోరుబాట పట్టారు. దౌర్జన్యాలను ఎదిరించడం మొదలు పెట్టారు. భూ సమస్య పరిష్కారం కోసం తుడుం మోగించి పోరును మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ రోజు సోమవారం ఇంద్రవెల్లిలో వారాంతపు సంత కూడా కావడం, మరోవైపు బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ఆదివాసీ గిరిజనులు తరలివచ్చారు. తొలుత సభకు అనుమతినిచ్చినా ఆ తర్వా త ఈ సభకు అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించారు. సభను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులు 144 సెక్షన్ ను విధించారు. అయినా ఆదివాసీ గూడాల నుంచి తరలివచ్చిన అడవి బిడ్డలతో ఇంద్రవెల్లి జనసంద్రంగా మారింది. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి జనాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.


Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం

ఈ క్రమంలో పోలీసులు, ఆదివాసీలకు మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్తత చోటు చేసుకోవడం.. ఓ ఆదివాసి మహిళకు ఓ పోలీసుకు మధ్య గొడవ జరగడంతో పరిస్థితి కాల్పులకు దారితీసింది. అప్పటి ఉట్నూర్ ఆర్డీవో ఆదేశాల మేరకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది అమాయక ఆదివాసీలు చనిపోయినట్టు ప్రభుత్వ రికార్దుల్లో ఉన్నది. అయితే అంతకన్నా ఎక్కువ మందే మరణించారని పౌర హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకుంటూ అమరులకు నివాళి అర్పించడం అనవాయితీగా వస్తున్నది.

పోలీసుల కాల్పుల ఘటనలో మృతి చెందిన ఆదివాసుల స్మారకార్థం ఇంద్రవెల్లిలో 80 అడుగుల స్థూపాన్ని నిర్మించారు. కానీ ఆ స్థూపాన్ని 1986లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డైనమెట్లతో పేల్చివేశారు. దీంతో ఆదివాసులు స్థూపం కోసం చేపట్టిన ఆందోళనల ఫలితంగా మరోసారి 1987లో ఈ స్థూపాన్ని నిర్మించారు. ఇక్కడే ఏటా ఏప్రిల్ 20న అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. ఏప్రిల్ 20న ఈ ప్రాంతంలో 144 సెక్షన్ తో పాటు పలు ఆంక్షలు విధించేవారు. ఇంద్రవెల్లి నుండి గుడిహథ్నూర్, ఉట్నూర్ మార్గాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఉండేది.


Indravelli Martyrs Memorial: ఇంద్రవెల్లి కాల్పుల విషాదానికి 45 ఏళ్లు.. అడవి బిడ్డల గుండెల్లో మానని గాయం

ఆపై 2009 నుండి తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో 2010- 2014 వరకు ఆదివాసి ఉద్యమ నేతలు సిడాం శంభు, కుమ్ర ఈశ్వరిబాయి,లు ఇద్దరే ఏప్రిల్ 20 రోజున వచ్చి పోలీస్ బందోబస్తు మధ్య ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించేవారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆంక్షలను కొంత సడలించడంతో ఆదివాసి గిరిజన సంఘాలు, ప్రతినిధులు, ఆదివాసీ గిరిజనులు ఇంద్రవెల్లి స్థూపం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపంపై సీఎం ప్రత్యేక దృష్టి

ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్థూపంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృషి సారించారు. ముందుగా 2021లో ఆయన కరోనా లాక్ డౌన్ సమయంలో టిపిసిసి అధ్యక్షునిగా, ఎంపీగా.. అప్పటి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుతో సన్నీహితంగా ఉండి ఇంద్రవెల్లికి వచ్చి ఏప్రిల్ 20న నివాళులు అర్పించారు. ఆపై 2022లో ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా సభ ఏర్పాటు చేసి 2023లో అధికారంలోకి వచ్చి.. సీఎంగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన వారి కుటుంబాలకు కొంత ఓదార్పునిచ్చారు.

పోలీసుల రికార్డు ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలను కేటాయించారు. రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశారు. వీరికి ఐటీడీఏ ద్వారా ట్రైకార్ రుణాలను కూడా ఇచ్చారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు రూ.కోటి కేటాయించి పనులను ప్రారంభించారు. స్మృతి వనం పనులు పూర్తికావడంతో ఇప్పుడు ఆ ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తలపిస్తున్నది. నేడు ఆహ్లాదకరమైన వాతావరణంలో స్మృతి వనంలో అధికారికంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
Adilabad News: చూపు లేకుండా పుట్టిన శిశువు.. తల్లిదండ్రులకు 1 కోటి పరిహారం చెల్లించాలని తీర్పు
చూపు లేకుండా పుట్టిన శిశువు.. తల్లిదండ్రులకు 1 కోటి పరిహారం చెల్లించాలని తీర్పు
KTR Cases: కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
Viral Video: వాంకిడిలో రైతును బురిడీ కొట్టించి 75 వేలు చోరీ.. పట్టపగలే సినిమా సీన్ తరహాలో
వాంకిడిలో రైతును బురిడీ కొట్టించి 75 వేలు చోరీ.. పట్టపగలే సినిమా సీన్ తరహాలో
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Updates: తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
తమిళనాడు రాజకీయాల్లో ముగిసిన సస్పెన్స్ -ఆదివారమే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం!
Tamilnadu Updates: ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
ఎట్టకేలకు విజయ్‌కు VCK సపోర్ట్ లెటర్ - ఈ సారి గవర్నర్ ప్రమాణ స్వీకారానికి అంగీకరించడం లాంఛనమే
Kadapa Tipu Sultan Issue: కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
కడపలో టిప్పు సుల్తాన్ పేరుపై రాజుకున్న వివాదం- ఆల్మాస్ పేట సర్కిల్ వద్ద ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత!
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Peddi Trailer : పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Women Smoking Effects : అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
Labbaru Bomma Song Lyrics: లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
లబ్బరు బొమ్మ సాంగ్ లిరిక్స్... 'పుష్ప' విలన్‌తో నందిని స్టెప్పులు - రాంబాబు గోసాల రాసిన మాసీ సాంగ్
Vagina Health : యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
Embed widget