రేపు విద్యుత్ సరఫరా బంద్- ఉదయం 8: 30 నుండి 10:30 వరకు  -132/33 కె.వి సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు  - ఏ డి ఈ ఆపరేషన్స్ శ్రీనివాస్ 

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తాలోని సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు నాగర్ కర్నూల్ ఏ డి ఈ ఆపరేషన్స్ శ్రీనివాస్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 8:30 నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్టు తెలిపారు.

220/132/11 కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని నాగర్ కర్నూల్ మండల పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్ లలో విద్యుత్ సరఫరా కు అంతరాయం ఉంటుందని తెలిపారు. నాగర్ కర్నూల్ మండలంలోని గ్రామాలతో పాటు పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా తెలకపల్లి, తాడూర్, బిజినేపల్లి మండలాల పరిధిలోని గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ తెలిపారు.

33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలోని నాగర్ కర్నూల్ టౌన్, కుమ్మెర, కొల్లాపూర్ ఎక్స్ రోడ్, పులిజాల, మంతటి, పెద్ద ముద్దునూర్, బిజినపల్లి, నంది వడ్డేమాన్, తెలకపల్లి, తాళ్లపల్లి, పెద్దూర్, గోలగుండం, తాడూర్, ఏంగంపల్లి, మేడి పూర్, ఐతోల్, నక్కలపల్లి,పెద్ద కారు పాముల  గ్రామాలలో విద్యుత్ సరఫరా ఉండదని ఆయన తెలిపారు. ఈ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు విషయం తెలుసుకుని సహకరించాలని ఏడిఈ ఆపరేషన్స్ శ్రీనివాస్ కోరారు.