MP Dharmapuri Arvind: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లెగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని అన్నారు. ప్రజల్లో క్రమంగా టీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరుగుతుండటం, బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతుండటంతో టీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జీబేపీకి చెందిన ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి అది తమ గొప్పగా టీఆర్ఎస్ వాళ్లు చెప్పుకుంటున్నారని తెలిపారు.
బీజీపీ అంటే కార్యకర్తలు..
రాష్ట్రంలో బీజేపీ అంటే కార్యకర్తలు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. దమ్ముంటే బూత్ స్థాయి కార్యకర్తను కొనుగోలుచేసే దమ్ము టీఆర్ఎస్ కు ఉందా.. అని ప్రశ్నించారు. ఆదివాసీ మహిళను దేశ ప్రథమ పౌరురాలిగా అత్యున్నత స్థానానికి ఎంపిక చేయటం కేవలం ప్రధాని మోదీతోనే సాధ్యం అయిందని వివరించారు. కుమురం భీం ఆసిఫాబాద్ కర్మభూమి, కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మభూమి ఆదిలాబాద్ జిల్లా.. ఇక్కడికి ఇంచార్జ్ గా రావటం నా అదృష్టం అని పేర్కొన్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీకి కంచుకోటగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మందు తాగి పడి.. పెద్ద ప్రచారం చేస్కుంటున్నారు!
ప్రజల్ని మోసం చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్క బీజేపీ వల్ల రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. అలాగే ప్రజా క్షేమమే బీజేపీ ధ్యేయమంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ వివరించారు. దేశంలోనే కాదు, ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా భారత్ ను మోదీ తీసుకెళ్తుంటే, టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు కుంచితంగా ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. మందు ఎక్కువై కాలు జారి పడి.. కాలు బెణికితే ఓ పట్టీ కట్టుకొని దాన్ని ఏదో పెద్ద విషయంగా ప్రచారం చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీలో కేటీఆర్ సినిమాలు చూశారు!
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోతుంటే... మంత్రి కేటీఆర్ మాత్రం ఓటీటీలో సినిమాలు చేశారంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు చేశారు. రాష్ట్ర పరిస్థితి పై కూర్చున్న చోటనుండే రీవ్యూలు ఎవరైనా చేయొచ్చని, ఏరియల్ సర్వేలూ చేయొచ్చని.. కానీ కేటీఆర్ అవేవీ చేయడంటూ ఆరోపించారు. పుక్కం వరాలు ఇవ్వడంలో కేసీఆర్, కేటీఆర్ లను మించినోళ్లు ఎలరూ లేరంటూ చెప్పారు. వాళ్ళ వాగ్ధానాల ముందు వరదలు, తూఫానులు కూడా తక్కువేనంటూ వ్యాఖ్యానించారు.
కరీంనగర్ డల్లాసైంది, హైదరాబాద్ విశ్వనగరమైంది..!
కరీంనగర్ డల్లాసైందని, హైదరాబాద్ విశ్వ నగరం అయిందంటూ టీఆర్ఎస్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జోడే ఘాట్ ను అంతర్జాతీయ పర్యాటక స్థలంగా చేస్తా అని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎం చేశాడంటూ ప్రశ్నించాడు. పోరాట యోధుడు భీం వారసులనే సీఎం కేసీఆర్ మోసం చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణా వ్యాప్తంగా వరదలతో పంటలన్నీ కొట్టుకుపోతే ఫసల్ భీమాలో రాష్ట్ర వాటా ప్రీమియం కట్టకపోవటంతో రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని, మొన్నటిదాకా కరోనా, ఇపుడేమో మంకీ ఫాక్స్.. విదేశాల్లో తిరిగింది కెటీఆరే ఏడ అంటిచ్చుకొచ్చిండోనని ఎద్దేవా చేశారు.