Modi on BRS Party  : అవినీతి పరులపై చర్యలు తీసుకోవాలా వద్దా అని పరేడ్ గ్రౌండ్స్ నుంచి ప్రధాని మోదీ ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాద్ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన.. పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రజలను ఉద్దేసించి మాట్లాడారు. ఈ సందర్భంగా నేరుగా బీఆర్ఎస్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.   అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదు..కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన కంట్రోల్ లో ఉండాలని అనుకుంటుంది. అవినీతి లేకుండా డీబీటీ ద్వారా సాయం అందిస్తున్నాం.. డిజిటల్ పేమెంట్ వల్ల అవినీతి అక్రమాలకు తావుండదు..అవినీతి పట్ల కఠినంగా వ్యవహరిద్దామా? వద్దా? అని ప్రశ్నించారు.  అధికార పార్టీ పేరు ఎత్తుకుండానే.. ఎవరి పేరు ప్రస్తావించకుండానే తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ తీరును విమర్శించారు ప్రధాని మోడీ. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు.


అవినీతిపై పోరాడుతున్న తమపై దాడి చేయానికి  అవినీతి పరులంతా కలిసి కోర్టుకు వెల్లారన్నారు. కానీ వారికి కోర్టు లెంపకాయ కొట్టిందన్నారు.  రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోవడంతో ప్రాజెక్ట్ లు ఆలస్యం అవుతున్నాయి.తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుందని ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని.. అదే నా బాధ, ఆవేదన అన్నారు మోడీ. మేం ప్రజల కోసం పని చేస్తుంటే.. కొందరు మాత్రం అవినీతికే పనులు చేస్తున్నారని రాష్ట్ర పాలనపై విమర్శలు, ఆరోపణలు చేశారాయన. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప మాత్రమే ఉందని.. ప్రజల ప్రయోనాలు చూడట్లేదన్నారు మోడీ.


తెలంగాణ పాలకులు..ప్రతి ప్రాజెక్ట్ లో తన కుటుంబం స్వార్థం చూస్తున్నారన్నారు.  ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టడం  సంతోషంగా ఉందని..ఇది కొత్త బిజినెస్ హబ్, పెట్టుబడులకు కేంద్రంగా మారిందని సంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రజలకు అందుబాటులో ఉండేలా రైల్వే సర్వీసులు చేపట్టాం..రైల్ప్రాజెక్టుల విస్తరణ వల్ల  ప్రజలకు ఉపయోగం.గడచిన 9 ఏళ్ళలో హైదరాబాద్ లో 75 కి.మీనెట్ వర్క్ నిర్మించామన్నారు. 


కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని.. రెండూ కలిసే ఉన్నాయన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతం కావాల్సి ఉందన్నారు. కుటుంబ పాలనతో అవినతి పెంచి పోషిస్తున్నారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు. తెలంగాణ ప్రజ ఆకాంక్షలు నేరవేర్చడమే తమ విది అని.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగాఉండాలని పిలుపునిచ్చారు. అవినీతి పరులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో కుటంబ పాలన అన్ని వ్యవస్థలనూ తన గుప్పిట్లో ఉంచుకోవాలని చూస్తోందన్నారు. తెలంగాణ కు కుటుంబ పాలన నుంచి  విముక్తి కావాల్సి ఉందని స్పష్టం చేశారు.  


ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభంచారు.  ప్రియమయిన సోదర సోదరీమణులారా.. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.. తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందడుగు పడిదందని చెప్పుకొచ్చారు.  వందేభారత్ రెండవ ట్రైన్ ప్రారంభించాం.. భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామిని చేరుకునేలా రైలు సర్వీస్ ని అనుసంధానించాం. 11 వేల కోట్ల ప్రాజెక్టులకు అంకురార్పణ, జాతికి అంకితం చేశాం.. రైల్, రోడ్ కనెక్టివిటీ, హెల్త్ ప్రాజెక్టులు చేపట్టమన్నారు.