Congress MLA Rajesh Reddy | తాడూరు: నేడు మరాఠా వీరుడు, 16 ఏళ్లకే కత్తి అందుకున్న యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ (Chhatrapati Shivaji Jayanti) 395వ జయంతి. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజికవర్గం తాడూరు మండలం ఐతోల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి బుధవారం నాడు ఐతోల్ గ్రామంలో శివాజీ విగ్రహం ఆవిష్కరించారు. నాగ్ అశ్విన్ స్వగ్రామం ఐతోల్ అని తెలిసిందే. వారి పూర్వీకులు ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వలస వెళ్లారు.


మహానటి లాంటి గొప్ప సినిమా తీసిన నాగ్ అశ్విన్ ఆపై రెబల్ స్టార్ ప్రభాస్‌తో కల్కి సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. స్థానికుడు అయిన నాగ్ అశ్విన్ కు అంతకుముందు ఐతోల్ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, నాగర్ కర్నూల్ డీఎస్పీ, సినీ దర్శకుడు నాగ్ అశ్విన్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు.



Chhatrapati Shivaji Statue: డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి



ఛత్రపతి శివాజీ విగ్రహం ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. ఆయన మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలి. ఇదివరకే నాగ్ అశ్విన్ గ్రామంలో స్కూల్ భవనం కట్టించారు. విద్యార్థులకు మ్యూజిక్ పరికరాలు ఇతర తోడ్పాడు అందించినందుకు మా తరఫున ధన్యవాదాలు.




గ్రామ యువత ఛత్రపతి శివాజీ విగ్రహానికి దాతలుగా ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో యూవత ఇలాగే శివాజీ లాంటి యోధుల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ధైర్యంగా అడుగులు వేస్తూ గ్రామ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. సనాతన ధర్మ పరిరక్షకుడు, గెరిల్లా యోధుడు ఛత్రపతి శివాజీ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. హిందూ సంప్రదాయాలను, సంస్కృతిని కాపాడుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలలో యువత ముందుండాలన్నారు. 


ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభం
బిజినేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి నూతన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను బుధవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళల్ని సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ మహిళా శక్తి క్యాంటీన్లు దోహదం చేస్తాయన్నారు. ప్రజా ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. 
గతంలో డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా అక్కా చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి తొలి ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి లాంటి పథకాలు తీసుకొచ్చిందన్నారు. మహిళా సంఘాల మహిళా అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజినేపల్లి మండల అధ్యక్షుడు మిద్దె రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నసీర్, ఈశ్వరయ్య ,ముఖ్తార్, బిజినేపల్లి మండల కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.