తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తైవాన్​ కంపెనీలకు అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఎలక్ట్రానిక్స్, ఈవీ రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా తైవాన్​ బృందాన్ని మంత్రి కేటీఆర్ కోరారు. ఇరు దేశాల మధ్య పెట్టుబడుల ప్రోత్సాహానికి తెలంగాణలో  ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ చెప్పారు.  ఈ విషయంపై తైవాన్ బృందం పాజిటివ్ గా స్పందించింది.  త్వరలోనే తైవాన్ కంపనీలతో వర్చువల్ ఇన్వెస్టిమెంట్ సదస్సు ఉంటుందని తైవాన్ డైరెక్టర్ జనరల్ వాంగ్ తెలిపారు. ఇక్కడ పెట్టుబడి పెట్టే అంశాలపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు. 


ప్రభుత్వ పాలసీలు, ముఖ్యంగా టీఎస్​ ఐపాస్​ లాంటి ప్రభుత్వ విధానాలను టీఈసీసీ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్​కు కేటీఆర్ తెలిపారు. తైవాన్​కు చెందిన ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర ప్రాధాన్య రంగాల్లో రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల గురించి కూడా చెప్పారు.  తాను స్వయంగా తైవాన్​లో పర్యటించి తెలంగాణలోని వ్యాపార అనుకూలతపై జరిపిన చర్చలను కేటీఆర్ గుర్తుచేశారు. తైవాన్- తెలంగాణ మధ్య పెట్టుబడుల విషయంలో సహకరించాల్సిందిగా డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్​ను మంత్రి ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ప్రభుత్వం - తైవాన్ పారిశ్రామిక వర్గాల పెట్టుబడులకు సంయుక్త భాగస్వామ్యంలో ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్ పార్క్​ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. భవిష్యత్ లో పెట్టుబడులకు తెలంగాణ సరైన ప్రదేశంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమని చెప్పారు.


తెలంగాణలోని  ఉన్న వ్యాపార అనుకూలతపై తనకు అవగాహన ఉందని... ఇక్కడ ఉన్న పెట్టుబడి అవకాశాలను తైవాన్ పారిశ్రామిక రంగానికి పరిచయం చేసేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​కు డైరెక్టర్ జనరల్ వాంగ్ హామీ ఇచ్చారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపిస్తున్న ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇతర రంగాల్లోని ప్రముఖ కంపెనీలతో ఒక వర్చువల్ ఇన్వెస్ట్​మెంట్​ సెషన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. తైవాన్ ఎకనమిక్ కల్చరల్ సెంటర్​ (TECC), తైవాన్​ ఎక్స్​టర్నల్ ట్రేడ్​ ​ డెవలప్​మెంట్​ (Taiwan External Trade Development Council - TAITRA), ఇన్వెస్ట్ ఇండియా సంయుక్త ప్రతినిధి బృందానికి.. ఐటీ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్స్, ఈవీ (EV) డైరెక్టర్ సుజయ్ కారంపూరి ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న వివిధ పెట్టుబడి అవకాశాలపైన వివరాలు అందించారు.


Also Read: Telangana CM KCR: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు సాగర్‌లో సీఎం కేసీఆర్ పర్యటనకు లింకేంటి?


Telangana CPGET 2021: సీపీజీఈటీ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..