కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ఏం చేసింది, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికతో ఏం జరిగిందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే కమిషన్ వేసి ఏం లాభం ఉందని, ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏ నిర్ణయం, చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును స్క్రాప్ చేస్తారా, కొనసాగించాలనుకుంటున్నారా.. రిపేర్ చేస్తారా.. ఏం చేయాలనుకుంటుందో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటూ సర్కార్ కోర్టులోకి బాల్ నెట్టారు అక్బరుద్దీన్.

Continues below advertisement

కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సభలో పెట్టాం, ఏం చర్యలు తీసుకుందాం, దీనిపై ఎలా ముందుకుపోదామని మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సభ్యులను అడుగుతున్నారు. ఈ చర్చ ఈరోజు ముగుస్తుందా, రేపు కూడా జరుగుతుందా అనేది ప్రభుత్వానికి కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. రష్యా, ఉక్రెయిన్ లాంటి ఏదైనా దేశంలో ఏమైనా అవినీతి జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పరిపాలన చేయాలని 20 నెలల కిందట తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. కానీ చర్యలు తీసుకోవడానికి ప్రతిపక్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇస్తోంది.

తమపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎలాగూ కోరదు. నేను ఓ మాట అంటా, ఇంకో సభ్యుడు మరో సలహా ఇస్తాడు. బీఆర్ఎస్ పార్టీని రిజెక్ట్ చేసి ప్రజలు కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇచ్చారు. కానీ మీరు అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. ఏదైనా తప్పు జరిగితే చర్యలు తీసుకోవడానికి బదులుగా ఏం చేయమంటారని ఇతర పార్టీల సభ్యులను ప్రభుత్వం అడగటం సరికాదు. ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకోవాలని మా మీద వేస్తున్నారు. మీరు చర్యలు తీసుకునే దమ్ము, దైర్యం లేకపోతే మీకు అధికారం ఎందుకు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు’ అని అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Continues below advertisement

అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. కాళేశ్వరం రిపోర్ట్ సభలో పెట్టి చర్చించాం. దీనిపై సభ్యుల అభిప్రాయాన్ని మాత్రమే ప్రభుత్వం కోరిందని, నిర్ణయం తీసుకునే అధికారం ఇచ్చామని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పడం సరికాదన్నారు.  రాజకీయాల్లో కక్ష సాధింపు ధోరణితో కాకుండా పీసీ ఘోష్ కమిషన్‌పై పారదర్శకంగా, ప్రజాస్వామ్య బద్ధంగా సభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి అనేది మా అభిప్రాయం అన్నారు.

అన్ని నిర్ణయాలు మమ్మల్నే అడిగి తీసుకున్నారా..

‘5 ఏళ్లు రాష్ట్ర బాధ్యతల్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అప్పగించారు. పరిపాలన బాధ్యతలతో పాటు ఏదైనా తప్పు జరిగితే చర్యలు, నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు. ఈ విషయంలో మా అభిప్రాయాన్ని అడుగుతారు ఇది మంచిదే. కానీ ప్రతి జీవో విషయంలో, ప్రతి నిర్ణయం విషయంలో ప్రతిపక్షాలను అడిగి నిర్ణయం తీసుకున్నారా అని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో తప్పు జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లు, సంబందిత అధికారులు, నేతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు ఇచ్చారు. కమ్యూనిస్టు పార్టీలు, ఎంఐఎం పార్టీలకు మాత్రమే ఎలక్టోరల్ బాండ్లు రాలేదన్నారు.