New Ration Cards: మీకు రేషన్ కార్డు లేదా? ఇలా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

Telangana News | తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి శుభవార్త చెప్పింది. మీ సేవా కేంద్రాలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించింది.

Continues below advertisement

TG Ration Cards | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కొత్త రేషన్ కార్డులపై నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదివరకే లబ్ధిదారులుగా భావిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే రేషన్ కార్డులు లేని కారణంగా పథకాలకు దూరం అవుతున్నామని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పథకాలకు ఎంత కాదన్నా, తెల్ల రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటున్నారని కార్డు లేని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వారికి ఊరట కలిగించే వార్త చెప్పింది.

Continues below advertisement

రేషన్ కార్డుల కోసం అర్హులైన వారు మీ సేవ కేంద్రాల్లో (Mee Seva Centers) దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. లబ్ధిదారుల నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫరాలశాఖ మీ సేవ కమిషనర్‌కు సూచించింది. తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం భారీగా డిమాండ్‌ ఉంది. జనవరి 26న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డుల జారీ ప్రారంభించింది. పలు గ్రామాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు జారీ చేసింది. తెలంగాణ ఏర్పాటయ్యాక రేషన్ కార్డులు ఇవ్వడం ఇదే తొలిసారి అని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే రేషన్ కార్డులు లేని కుటుంబాలు చాలానే ఉన్నాయని, కార్డు లేని కారణంగా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని, పలు విధాలుగా నష్టపోతున్నామని పేద, మధ్యతరగతి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. 

Continues below advertisement