Mayawati announced that BSP is not making alliances with anyone : బహుజన్ సమాజ్ పార్టీ  అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవచ్చన్న ప్రచారాన్ని ఖండించారు.  అయితే ఇలాంటి వార్తలను పుకార్లే అని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఆమె ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడం లేదనిక ప్రకటించారు.  

Continues below advertisement





 


గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో మాయావతి పార్టీ పొత్తు పెట్టుకుంది. మాయావతి ట్వీట్ చేస్తూ, ‘బీఎస్పీ పూర్తి సన్నద్ధతతో తన సొంత బలంతో దేశంలో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో పోరాడుతోంది. ఎన్నికల కూటమి లేదా మూడవ ఫ్రంట్ ఏర్పాటు గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లే. ఇలాంటి దుర్మార్గపు వార్తలు ఇచ్చి మీడియా తన విశ్వసనీయతను కోల్పోకూడదు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. యూపీలో బీఎస్పీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు అశాంతికి లోనవుతున్నాయి. అందుకే రకరకాల పుకార్లు పుట్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే బహుజన సమాజ్, బీఎస్పీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 


ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ఖాయమన్నారు. మాయావతి కాంగ్రెస్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూటమి భాగస్వాముల కోసం ఆమె పార్టీ వెతుకుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సారి   లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయావతి కొన్ని వారాల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. బీఎస్పీ, కాంగ్రెస్‌ల పొత్తు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో రెండు పార్టీలకు మేలు చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే దళిత-ముస్లిం కూటమి ప్రయోజనాలు సాధించి ఉండేవారు.                     


మాయవతి ప్రకటనతో తెలంగాణలో పొత్తులపై చర్చ ప్రారంభమమయింది.  బీఆర్ఎస్ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశమై పొత్తుల గురించి చర్చించారు. కలిసి పోటీ చేస్తామన్నారు. అయితే తాము ఇంకా  మాయవతితో మాట్లాడలేదని.. మాట్లాడిన తర్వాత విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. మూడు రోజులు గుడిచినా రెండ వైపుల నుంచి ఎలాంటి స్పందన  రాలేదు. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తుపై అనుమానాలు ప్రారంభమయ్యాయి.