Kottagudem Lands : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ఎరవెండి గ్రామంలో  పోడుభూముల వివాదం చెలరేగింది.  అటవీ  శాఖ అధికారులు మహిళల బట్టలు చింపాని.., వారిపై దాడి కూడా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.  ఆదివాసీలు తమ 30 ఏళ్ల నాటి పొడు   భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే దాన్ని స్వాధీనం  చేసుకునేందుకు  అటవీ అధికారులు ప్రయత్నించారు. 

అటవీ అధికారులు  JCB యంత్రాన్ని తీసుకొచ్చి భూమిలో పంటల్ని తొలగించేందుకు ప్రయత్నించారు.  దీనికి ఆదివాసీలు నిరసన తెలపారు. అడ్డుకునే ప్రయత్నంచేశారు.  అధికారులు వారికి దౌర్జన్యంగా వ్యవహరించి, మహిళలపై దాడి చేశారు. కొందరి మహిళల బట్టలు కూడా చింపారన్న ఆరోపణలువస్తున్నాయి. తమ బట్టలు చింపారని ఆదివాసీ మహిళలు కన్నీరు పెట్టారు. 

దశాబ్దాలుగా ఆ భూమిపై వ్యవసాయం చేస్తూ జీవనోపాధిని కొనసాగిస్తున్నామని అయితే ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తమను ఆ భూమి నుంచి తరిమేయాలనుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశస్తున్నారు.   ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ హక్కులను రక్షించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.    మా మహిళలపై దాడి చేస్తుండగా వీడియో తీస్తే మమ్మల్ని కొట్టారు, ఫోన్లు లాక్కున్నారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.   JCB తో మీ ఇళ్లు కూల్చేస్తాం. ఆపరేషన్ కాగర్ మొదలుపెడతామని హెచ్చరిస్తున్నారని..కన్నీరు పెట్టుకున్నారు.  స్థానిక ఆదివాసీ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసీ సంఘాలు ఇప్పటికే నిరసన కార్యక్రమాలు ప్రారంభించాయి.

ఈ ఘటనపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఒక గూండా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, అది అటంకవాద్ కా దుకాన్, అత్యాచార్ కా కేంద్ర, రాజ్యాంగ భ్రష్టాచార్ అవుతుందని  రాహుల్, ఖర్గేలకు ట్వీట్ చేసి మండిపడ్డారు. 

పోడు భూములు అంటే గిరిజనులు , ఇతర సంప్రదాయ వ్యవసాయదారులు అడవుల్లో చెట్లు, పొదలు నరికి సాగు చేసే భూములు. తెలంగాణలో ఈ భూముల సమస్య గిరిజన హక్కులు, అటవీ సంరక్షణ,  ప్రభుత్వ విధానాల మధ్య  వివాదాలుగా మారుతున్నాయి.  అటవీ హక్కుల చట్టం (FRA, 2006) కింద పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. తెలంగాణలో 6.69 లక్షల ఎకరాలకు పట్టాలు మంజూరైనప్పటికీ, లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి .  కొందరికి పట్టాలు వచ్చినా, క్లెయిమ్ నంబర్లు  లేవు.  అటవీ అధికారులు పోడు భూములను అటవీ భూమిగా గుర్తించి, సాగుదారులను బలవంతంగా తొలగించడం లేదా హరిత హారం కోసం మొక్కలు నాటడం జరుగుతోంది. వీటిని గిరిజనులు అడ్డుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి.