Maharastra BRS leaders :  మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు మాజీ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు కోర్దినేటర్లు సమావేశం అయ్యారు. లోక సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా.. లేదా.. అనే విషయంలో వారం రోజుల్లో స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కు రాసిన లేఖలో మహారాష్ట్ర పేర్కోన్నారు. అలాగే కేసీఆర్ వైఖరితో రాబోయే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలో తెలియక అక్కడి నేతలు సతమతమవుతున్నట్లు.. తెలిపారు.


తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మహారాష్ట్రలో పార్టీ ఆఫీసులకు అద్దె చెల్లింపు నిలిపేశారు.  మహారాష్ట్ర నేతల ఫోన్లు లిఫ్ట్‌ చేయడం లేదు.  పార్టీ కార్యక్రమాలకు నిధులు కూడా ఇవ్వడం లేదు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్‌ నుంచి పలువురిని చేర్చుకున్న బీఆర్‌ఎస్‌ చీఫ్ తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత చేతులెత్తేశారు.   తాజా పరిణామాలపై  సమావేశమైన ఆరుగురు కోఆర్డినేటర్లు  బీఆర్‌ఎస్‌లో చేరి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ఘాటు లేఖను  పంపారు. తమకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.                                                                 


మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బలోపేతానికి  కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. నాగ్ పూర్ లో పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.  దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ విస్తరణకు తొలి అడుగు మహారాష్ట్ర నుంచే మొదలవుతుందని కేసీఆర్ ప్రకటించి.. ఆ మేరకు నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు.   పలు బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించారు. ఇక పార్టీ పరంగా నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి  15 మంది సభ్యులతో తాత్కాలిక స్టీరింగ్ కమిటీని నియమించారు.  కేసీఆర్ చైర్మన్‌గా మరో 14 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు అయ్యింది. కే. వంశీధర్ రావును మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జిగా నియమించారు.                                                   


తెలంగాణతో పాటు మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో నూ అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే తెలంగాణలో  ఓడిపోవడంతో.. కేసీఆర్  పూర్తిగా  ఇతర రాష్ట్రాల్లోరాజకీయ కార్యకలాపాలు నిలిపివేశారు. మహారాష్ట్ర గరించి అసలు  పట్టించుకోవడం లేదు. దీంతో అక్కడి నేతలకు దిశానిర్దేశం కరవయింది. పార్టీ నడపడానికి  నిధులు లేకుండా పోయాయి. దీంతో వారు అసహనంలో ఉన్నారు.