Maganti Gopinath family inheritance issue: దివంగత జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం రోడ్డున పడింది. వారసత్వ వివాదంపై ఆయన ఇరువురు భార్యలు, పిల్లలు వాదులాడుకుంటున్నారు. ఈ క్రమంలో వారు ఆర్డీవో ఎదుట విచారణకు హాజరయ్యారు. మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్  తన తల్లినే గోపీనాథ్ లీగల్ వైఫ్ అని..తానే వారసుడ్ని క్లెయిమ్ చేయుసుకుంటున్నారు.   ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇష్యూపై జూబ్లీ హిల్స్ తహశీల్దార్ ఎదుట జరిగిన విచారణలో రెండు వర్గాలు హాజరయ్యాయి. తదుపరి విచారణ నవంబర్ 25న నిర్వహించనున్నారు.  
 
జూబ్లీ హిల్స్ మాజీ MLA మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన కుటుంబంలో వారసత్వ వివాదం మరింత ఉద్ధృతమైంది. మొదటి భార్య కుమారుడు మాగంటి ప్రద్యుమ్న తారక్ "నేనే చట్టబద్ధ వారసుడ్నని" అని స్పష్టంగా క్లెయిమ్ చేశారు. గోపీనాథ్ తల్లి కూడా ఈ వాదనకు మద్దతు ఇచ్చి, సునీతను "అధికారికంగా పెళ్లి చేసుకోలేదు" అని ఆరోపించారు.  మాగంటి గోపీనాథ్ కు రెండు పెళ్లిళ్లు జరిగాయని, ఇద్దరు భార్యలు ,  పిల్లలు ఉన్నారని నామినేషన్ పరిశీలన రోజు  వరకు బయటపడలేదు. సునీత నామినేషన్ దాఖలు చేసిన తర్వాత, మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న తారక్ RDO ఎదుట ఫిర్యాదు చేశారు. "సునీత లీగల్‌గా గోపీనాథ్‌ను పెళ్లి చేసుకోలేదు, భార్య కాదు" అని ఆరోపించి, అఫిడవిట్ తిరస్కరణ కోరారు. అయితే, అప్పటికి నామినేషన్ ఆమోదం పొందింది.

Continues below advertisement


సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై మొదటి భార్య వర్గం మరో ఫిర్యాదు చేసింది. దీంతో తహశీల్దార్ ఎదుట విచారణ మొదలైంది.  సునీత తరపున ఆమె కుమార్తె, మొదటి భార్య వర్గం నుంచి ప్రద్యుమ్న తారక్, గోపీనాథ్ తల్లి హాజరయ్యారు. విచారణలో గోపీనాథ్ తల్లి మొదటి భార్య వైపు నిలిచారు. ప్రద్యుమ్న తారక్ మాత్రమే మా కుమారుడి చట్టబద్ధ వారసుడన్నారు. నా కుమారుడు చనిపోయినప్పుడు చూసేందుకు కూడా సునీత మాకు అవకాశం ఇవ్వలేదు. ఆమె మమ్మల్ని దూరంగా ఉంచిందని ఆరోపించారు.   





 
తన కుమారుడు గోపీనాథ్ హాస్పిటల్ కి వెళ్ళింది కూడా నాకు తెలియకుండా చేశారని అన్నారు. మూడు రోజుల నా కొడుకు ఆస్పత్రిలో ఉంటే అక్కడే ఉన్న నన్ను కన్న తల్లిని కనీసం చూడనివ్వలేదన్నారు.  మూడు రోజుల ముందు చనిపోయాడన్న వార్త బయటికి చెప్పించి తర్వాత ఏం కాలేదు అని చెప్పి వెంటిలేటర్ మీద పెట్టారని .. అలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. కేటీఆర్ నాకు సమాధానం చెప్పాలీ, 90 ఏళ్ల వయసులో నా కడుపు కోతకు కరణం కేటీఆరేనని ఆరోపించారు. కేటీఆర్ హాస్పిటల్ కి వచ్చినప్పుడు అడిగినా " ఒక్క సారి గోపీని చూపించండి అని " పెద్ద దాన్ని అని చూడకుండా మొహం మీద డోర్ వేసి వెళ్ళిపోయాడన్నారు.అంత కేటీఆర్ కి తెలిసే జరిగిందీ, అయిన సమాధానం చెప్పే తీరాలని గోపీనాథ్ తల్లి డిమాండ్ చేశారు.   


అయితే సునీత తరపు లాయర్ మాత్రం.. మాగంటి గోపీనాథ్ భార్య సునీతేనని అన్ని రికార్డుల్లోఉందని స్పష్టం చేశారు. పిల్లల పేర్లు కూడా లీగల్ గా రికార్డుల్లో ఉన్నాయన్నారు.  తహశీల్దార్ నవంబర్ 25న తదుపరి విచారణ నిర్వహిస్తారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇష్యూ పెండింగ్‌లో ఉంటుంది