KTR Hindi :  బలవంతంగా హిందీ భాష రుద్దడానికి తాము వ్యతిరేకమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉత్తరాదికి చెందిన ఓ వ్యక్తి ఇంగ్లిష్‌లో కేటీఆర్‌ను ట్విట్టర్‌లో ప్రశ్నించారు.  తన ప్రశ్నకు సమాధానం హిందీలో చెప్పాలని ఆయన డిమాండ్ చేసినట్లుగా అడిగారు. దానికి కేటీఆర్ ఇంగ్లిష్‌లోనే సమాధానం  చెప్పారు.  హిందీని రద్దుడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.  కాలుకు దెబ్బ తగలడడంతో విశ్రాంతి తీసుకుంటున్న కేటీఆర్ ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రికి ప్రోటోకాల్ ఎక్కడా లోటు రానీయలేదని.. ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం చెప్పామని.. సీఎం హాజరు కాకపోవడంపై అదే వ్యక్తి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు. 





నిజానికి తెలంగాణలో హిందీ వ్యతిరేకత  అంత ఎక్కువగా లేదు.. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం అక్కడి రాజకీయ పార్టీలు  హిందీని ఇంపోజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాయి. తమ మాతృభాష ఉనికికి అది ప్రమాదకరమని చెబుతూ ఉంటారు. తెలంగాణ ఎక్కువ కాలం నిజాం పాలనలో ఉండటం.. ఒకప్పుడు ఉర్దూ మీడియం ప్రధానం కావడంతో ఇక్కడ హిందీ ఎక్కువ మందికి వస్తుంది. హిందీని అంత దూరంపెట్టే భాషగా ఎవరూ చూడరు. కానీ కేటీఆర్  కూడా ఇంతకు ముందు ఇలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. కానీ కేటీఆర్‌ను ప్రశ్నించిన వ్యక్తి ఇంగ్లిష్‌లో ప్రశ్న అడిగి.. హిందీలో సమాధానం చెప్పాలని ఒత్తిడి చేయడంతోనే ఇలా  స్పందించినట్లుగా తెలుస్తోంది. 


ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా పలువురు ఇతర ప్రశ్నలు కూడా వేశారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి  వాట్సాప్ డీపీలు పెట్టుకుంటే జీడీపీ పెరుగుతుందా అని ప్రశ్నించారు. ఆ వ్యక్తి తెలుగులో ప్రశ్న వేసినప్పటికీ.. కేటీఆర్ హిందీలో సమాధానం చెప్పారు. 





కేటీఆర్ హిందీ పక్కాగా మాట్లాడగలరని.. ఆయనకు బాగా వచ్చని ఈ ట్వీట్‌తోనే అర్థమైపోతుంది. భారత్‌తోనే హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా.. కేటీఆర్ కొన్ని వివరాలతో వెల్లడించారు.