KTR allegations against Revanth:   ముఖ్యమంత్రి బెదిరింపులు తట్టుకోలేకనే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి L&T తప్పుకుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి ముడుపుల కోసం వేధిస్తున్న వేధింపులు తట్టుకోలేకనే కంపెనీ రాష్ట్రం నుంచి పారిపోతున్నదని. రాష్ట్రంలోని తమ కార్యకలాపాల నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుంటోందన్నారు. గతంలో L&T సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ని జైల్లో పెడతా అన్నాడని గుర్తు చేశారు. వాళ్లని వీళ్ళని జైల్లో పెడతా అంటే ఇలాంటి దుర్మార్గమైన ఫలితాలు వస్తాయని.. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఉంటుందని కేటీఆర్ ప్రశ్నించారు. 

Continues below advertisement

త్వరలోనే గతంలో అనేక వివాదాలు ఉన్న ఎమ్మార్ సంస్థ యొక్క ఆస్తులను రేవంత్ రెడ్డి అమ్మ బోతున్నాడని.. ఇందులో ఎంత కమిషన్ తీసుకున్నాడు అనేది తెలుస్తామన్నారు. గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను… ముందు పెట్టి ఆయా కంపెనీలతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నాడని.. అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని భారీగా వసూళ్లకు రేవంత్ రెడ్డి తెగబడుతున్నాడని ఆరోపించారు.

కనీసం గ్రూప్‌ వన్ అభ్యర్థులు, విద్యార్థులు రౌండ్‌టేబుల్ సమావేశం కూడా పెట్టుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. స్కూల్‌లు, కాలేజీలు బంద్‌, ఆరోగ్యశ్రీ సేవల రద్దుతో హాస్పిటల్‌లు యూరియాతో ఆగిపోయాయి.  ఆశ వర్కర్లకు సంబంధించి, రేషన్‌ డీలర్లకు సంబంధించిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు సచివాలయానికి రావడం లేదు… గతంలో ప్రజా భవన్ గురించి అనేక అబద్దాలు మాట్లాడినాడు  అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కి వస్తున్నాడా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బీసీలను మోసం చేస్తున్నారని కరాకండిగా చెబుతున్నామమని.. ముందు నుంచే కూడా రేవంత్ రెడ్డి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడన్నారు.    తనపైన ఉన్న వ్యక్తిగత కోపాన్ని రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నలపైన  చూపిస్తున్నాడని.. సిరిసిల్ల నేతన్నల పొట్ట కొట్టి మొత్తం పరిశ్రమను అంతలాకులం చేశాడని ఆరోపించారు.  12 వేల కోట్లు డ్రగ్స్ దొరికితే రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం సమాచారం లేదని.. ఇంత పెద్ద అరాచకం రాష్ట్రంలో నడుస్తుంటే ఈగల్ టీం, హైడ్రా అంటూ ఎందుకు తమాషాలు చేస్తున్నారని ప్రశ్నించారు. అసలు ఇప్పటిదాకా హైడ్రా చేసిన పని ఏమిటి? మరి ఇవన్నీ చేస్తే వర్షం వచ్చేటప్పుడు హైదరాబాద్‌ నగరం ఎందుకు మునిగిపోతుందో చెప్పాలన్నారు. 

Continues below advertisement

పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో ఎలుకలమాదిరి మారిందన్నారు. మా పార్టీ నుంచి చేరిన నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే జాలి కలుగుతుందని.. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కొట్లాడిన ప్రతి ఒక్కరు… ఆ పార్టీ నియోజకవర్గాల్లో దారుణంగా మోసపోయారన్నారు. నిజంగా రాష్ట్రంలో అద్భుత పాలన ఉంటే వెంటనే ఉప ఎన్నికలు పెట్టాలని సవాల్ చేశారు. బిఆర్ఎస్‌ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ బీ-ఫారమ్‌తో పోటీ చేసిన దానం నాగేందర్‌ స్పీకర్‌ ఇంకా చెప్పేది ఏముందని ప్రశ్నించారు.  రీజినల్ రింగ్ రోడ్ అలైన్మెంట్‌ మా ప్రభుత్వం ఉన్నప్పుడు రూపొందించడం జరిగింది... కానీ దాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంత ప్రయోజనాల కోసం మార్చుతోందని..  ఫోర్త్ సిటీ దగ్గరలో ఉన్న తమ భూముల కోసం అలైన్మెంట్‌ మాత్రం రీజినల్ రింగ్ రోడ్ స్వరూపం మారిపోయిందన్నారు. 

ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అమలుకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం, రీజినల్ రింగ్ రోడ్‌ కోసం మాత్రం తమ భూముల్లో లాభం జరగడం కోసం భూములు కడతామని చెబుతోంది. రీజినల్ రింగ్ రోడ్డుకి, ఫోర్త్ సిటీకి మధ్యలో వేస్తున్న రోడ్‌ కేవలం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల భూముల కోసం వేస్తున్నారు. ఈ రోడ్డు వెంబడి అనేక మందితో భూములు కొనుగోలు చేసి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.