Kavitha makes serious allegations against Harish Rao: జూబ్లిహిల్స్ ఉపఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పై తన ఎటాక్ ను మరింత ఉద్ధృతం చేశారు కల్వకుంట్ల కవిత. మెదక్ లో మీడియాతో మాట్లాడుతూ హరీష్ రావును పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు.   హరీష్ రావు కుటుంబం ప్రైవేట్‌గా పాల వ్యాపారం చేసి, పాల రైతులకు అన్యాయం చేసినట్టు ఆరోపించారు. టెండర్లు లేకుండానే హాస్టళ్లకు పాలు సప్లై చేసి డబ్బు సంపాదించుకున్నారని, ఇది రైతుల హక్కులను మోసం చేసినట్టు అన్నారు.   హరీష్ రావు కుటుంబానికి చెందిన కంపెనీలు  టెండర్ ప్రక్రియ లేకుండా హైదరాబాద్, మెదక్ ప్రాంతాల్లోని హాస్టళ్లకు, హాస్పిటల్స్‌కు పాలు సప్లై చేసి, రూ. 50-100 కోట్లు వ్యాపారం చేశారని ఆరోపించారు. . ఇది ప్రభుత్వ డైరీల కు పోటీగా, రైతుల నుంచి తక్కువ ధరలకు కొని  ఎక్కువ ధరలకు అమ్మారని చెప్పారు.  పాల రైతులు లీటర్‌కు రూ. 20-25 పొందుతున్నారు, కానీ హరీష్ కుటుంబం ఇంటర్మీడియరీల ద్వారా రూ. 15-18కి కొని, హాస్టళ్లకు రూ. 40-50కు అమ్ముతూ లాభాలు పొందిందని  ఇది రైతులకు సబ్సిడీలు, మార్కెటింగ్ సపోర్ట్ లేకుండా చేసిందని, బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి అక్రమాలు జరిగాయని కవిత ఆరోపించారు.  పాల వ్యాపారం ద్వారా రూ. 200 కోట్లకు పైగా అక్రమ ఆదాయం వచ్చిందన్నారు. 

Continues below advertisement

మోసం చేయడమే హరీష్ రావు  నైజమని, పార్టీలో ఉంటూనే ద్రోహం చేశారని జూబ్లిహిల్స్ ఎన్నికల గురించి ప్రస్తావించారు.   బీఆర్ఎస్ ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీశ్‌రావుకు అలవాటని, ఆయన గురించి గట్టిగా మాట్లాడినందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపారని అన్నారు.  15 మంది ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వాలని తనను అడిగితే తనకు సంబంధం లేదని చెప్పానని, అయితే వారే హరీశ్‌రావు వద్దకు వెళ్లగా ‘మీ ఇష్టం’ అని ఆయన సమాధానమిచ్చారని కవిత ఆరోపించారు. తాను బీఆర్ఎస్‌లో లేను కాబట్టి దూరంగా ఉన్నానని, కానీ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీశ్‌రావు ఇలా వ్యవహరించడం మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు.   కేటీఆర్, హరీశ్‌రావు పేరుకే కృష్ణార్జునులని, ట్వీట్లు చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నారు.          

బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులు పెంచుకున్నారు కానీ, పార్టీ కేడర్‌ను పెంచుకోలేదని  .. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందన్నారు.  జగదీశ్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వారికి వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు.  ప్రశ్నించారు. ఒకప్పుడు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించి పార్టీని వీడిన పద్మా దేవేందర్‌రెడ్డికి ఇప్పుడు హరీశ్‌రావు ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు.  రీజనల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్  హరీష్ రావు ఫాంహౌస్ కోసమే మార్చారని విమర్శించారు. ఆయనకు నాలుగు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉందని.. అందులో సెవన్ స్టార్ రిసార్ట్ నిర్వహిస్తున్నారన్నారు.  ఫామ్ హౌస్ ను కాపాడుకునేందుకు రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారని  ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ల్యాండ్ కోసం ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చారు.    హరీష్, రేవంత్ రెడ్డి దోస్తులని..హరీశ్‌‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డికు సంబంధాలు ఉన్నాయనన్నారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ఫలితాల తర్వాత కవిత మరింత దూకుడుగా విమర్శలు చేస్తున్నారు.