Kavitha  husband Anil Wants  10 days for the ED investigation  :  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈడీ విచారణకు హాజరు కావొద్దని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు  ఈడీకి ఆయన లేఖ రాశారు. విచారణకు హాజరు కాలేనని లేఖలో ఈడీకి స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్‌‌లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరిపారు. కవిత భర్త ద్వారా లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా  చార్జిషీట్‌లోనూ ఈడీ తెలిపింది.             


 సోమవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలని కవిత భర్తతో పాటు, ఆమె పీఏ, ముగ్గురు వ్యక్తిగత సిబ్బందికి ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ పది రోజుల సమయం కావాలని ఈడీకి లేఖరాశారు.  కవిత భర్త విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. కవిత భర్త లేఖపై ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతీ రోజూ ఈడీ విచారణ ముగిసిన  తర్వాత కవిత గంట సేపు కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ములాఖత్‌కు కూడా కవిత భర్త హాజరు కాలేదు. ఉదయం ఆయన సుప్రీంకోర్టులో ఈడీపీ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు.                   


 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎంఎల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటిఃవరకు 15 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడించింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని వివరించింది.


 ఈ నెల 23 వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఈడీ పేర్కొంది.  ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించాని ప్రకటనలో తెలిపింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని  ప్రకటనలో తెలిపింది.