సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు రెండు నెలల పాటు వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లోపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై సింగరేణి యాజమాన్యం సవాల్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్  వచ్చిన వేళ సింగరేణి గుర్తింపు సంఘ ఎన్నికలను పోస్టుపోన్ చేయాలని రిక్వస్ట్ చేసింది. 


సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ప్రస్తుతానికి ఎన్నికలు వాయిదా వేయాలని సూచించింది. డిసెంబర్ 27 ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. నవంబర్‌ 30 లోపు ఎన్నికల తుది జాబితాను సిద్ధం చేసి కార్మిక శాఖకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 


ఆరు జిల్లాల్లో 15 యూనిట్లు ఉన్నాయి అందులో 40 వేల మంది కార్మికులు ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న వేళ సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలకు సహకరించలేమని ఆయా జిల్లాల కలెక్టర్లు చెప్పారు. కార్మిక సంఘాలు కూడా వాయిదాకు సమ్మతించాయి. దీంతో ఎన్నికలను కోర్టు వాయిదా వేసింది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణ వాయిదా వేసింది.