Gangula Kamalakar key decision over Heart Attacks at Young Age 
- యుక్త వయస్సులోనే గుండెపోటుకు గురికాకుండా నిర్బంద వైద్యపరీక్షల నిర్వహణ
- రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్


ఇటీవల తెలంగాణలో అతి చిన్న వయస్సు వారు గుండెపోటుతో మరణిస్తుండగా మంత్రి గంగుల కమలాకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో అటువంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా జిల్లాలోని ప్రతి కళాశాలలో నిర్బంద వైద్యపరీక్షలను నిర్వహించడానికి చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ తెలిపారు. చ
చిన్న వయసులో గుండెపోటు మరణాలపై స్పందించిన మంత్రి
శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు, ఐఎంఏ అసోసియేషన్, ఫార్మసి అసోసియేషన్, వైద్యాదికారులు కార్టియాలజిస్టులతో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమీక్షించారు.  ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అతిచిన్న వయస్సువారు గుండెపోటుతో మరణిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. కరీంనగర్ జిల్లాలో ఎక్కడా కూడా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవడానికి వీలు లేకుండా నగరాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దేలా ఉచిత వైద్య శిబిరం, ఆరోగ్య పరీక్షల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు.  


ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని కళాశాలల్లోని విద్యార్థులకు నిర్బంద గుండే సంబంధిత ఈసిజి, రక్తపరీక్ష మొదలగు వైద్యపరీక్షలను నిర్వహించెలా ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని తెలిపారు.  ఈ దిశగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని,  అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఐఎంఏ, డయోగ్నోస్టిక్ నిర్వహాకులు వారి పూర్తి సహాకారాన్ని అందించాలని అన్నారు.  వైద్యపరీక్షల నిర్వహాణలో కావాలసిన పూర్తి సహయ, సహాకారాన్ని అందిస్తానని మంత్రి తెలిపారు. అదేవిధంగా జిల్లాలో పోలీస్, మున్సిపల్ సిబ్బందికి సిపిఆర్ ద్వారా సహాయాన్ని ఎవిధంగా అందించాలో అవగాహాన కల్పించాలని సూచించారు. 


నిర్భంధ వైద్య పరీక్షల ద్వారా అనారోగ్యంగా ఉన్న వారిని ముందస్తుగా గుర్తించి కొంత మందిని అయినా బితికించవచ్చని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో సేవ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, నగర మేయర్ వై. సునీల్ రావు, అడిషన్ కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్,  గరిమా అగర్వాల్, జట్పి సిఈఓ ప్రియాంక, ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో,  అధికారులు, డాక్టర్లు, ఐఎంఎ ప్రతినిధులు పాల్గొన్నారు. 


గుండెపోటుతో కుప్పకూలిపోయి బీటెక్ విద్యార్థి మృతి 
హైదరాబాద్ నగరంలో శుక్రవారం మరో విషాదం చోటుచేసుకుంది. ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూపోయిన ఓ విద్యార్థి నిమిషాల వ్యవధిలో కన్నుమూశాడు. మేడ్చల్ లోని సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటివరకూ తోటి విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడు. కానీ కాలేజీ ఆవరణలో విద్యార్థి విశాల్ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మార్గం మధ్యలోనే ఆ విద్యార్థి మృతి చెందాడు.