రాష్ట్రంలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలని, ధరణి పోర్టల్ లోని లోపాలను సరిదిద్ది రైతులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ‘మౌన దీక్ష’ పేరిట నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.


కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరపతలపెట్టిన ఈ ‘మౌన దీక్ష’లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పాల్గొంటున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలంతా తమ తమ ప్రాంతాల్లో ‘మౌన దీక్ష’కు సంఘీభావం తెలపనున్నారు.


బండి సంజయ్ గతంలో మన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలుమార్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అప్పటి నుండి సీఎంతో సహా కుటుంబ పాలనపై పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. ఇక పలు ప్రాజెక్టులు వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని కొన్ని పథకాలు అయితే పూర్తిగా పేర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం తన పథకాలు గా చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారని అప్పట్లో ఆరోపించారు ప్రజల్లోకి వెళ్లే ప్రతి అంశంపైనా పకడ్బందీ కార్యచరణ నిర్దేశించి కార్యకర్తలకు స్థానిక నాయకులకు కు ఆయా సభలు నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా చేయగలిగారు.


గతంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయంలో అక్కడ పెద్ద ఎత్తున ఉన్న గిరిజన భూముల అంశాన్ని సైతం ప్రస్తావించడమే కాకుండా ఏకంగా ధర్నాలకు దిగడంతో తీవ్రమైన ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అటవీ భూములు ఆక్రమించి నివాసముంటూ వ్యవసాయం చేసుకుంటున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి చెయ్యి చూపారని దీనివల్ల వారు తాత్కాలికంగా నిర్మించుకున్న షెడ్లను ఇతర నివాసాలను అధికారులు కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున కబ్జాలు చేస్తున్నా నోరుమెదపని కేసీఆర్ పేద ప్రజలపై మాత్రం పోలీసుల సహాయంతో విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


అన్ని అంశాల్లోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే క్రమంలో రానున్న ఎన్నికల వరకు దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించినట్లయితే ప్రత్యేక కార్యాచరణను సిద్ధం అవుతున్నట్లు కూడా సమాచారం. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో పెద్దగా పట్టు లేని బీజేపీ పోయినసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఈ విధంగా ఎంపీ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఈసారి  కూడా రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల మద్దతుతో ఎన్నికల్లో వీలైనంతవరకు సీట్లు గెలుచుకునే విధంగా వారికి సంబంధించిన అంశాల పట్ల దూకుడు పెంచింది. అయితే గతంలో నిరసనలు ధర్నాలతో ప్రభుత్వంపై విరుచుకుపడుతూ దూసుకెళ్తున్న బండి సంజయ్ ఈసారి పోడు భూముల అంశాన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్తారు అనేది వేచి చూడాలి.