Minister Gangula Kamalakar : బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే అని రాష్ట్ర బీసీ, పౌరసఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కొత్త జాతీయ పార్టీపై స్పందించిన ఆయన... దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే అని ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. తాను ఎల్లప్పుడూ కేసీఆర్ వెంటే ఉంటానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ప్రకటనపై దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. దేశ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని గంగుల కమలాకర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని రాంనగర్లో రూ.35 లక్షలతో మార్కెట్ ఆధునీకరణ పనులకు మంత్రి సోమవారం ప్రారంభించారు.


ప్రజలు శభాష్ అనేలా అభివృద్ధి


తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.  పల్లెలన్ని పట్టణాలుగా మారాలి. పల్లెలు, పట్టణాలు మెరవాలి. ప్రజలు మురవాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నాం. గతంలో మహిళలు, ప్రయాణాల్లో నగరంలో టాయిలెట్స్ కోసం బయటికెళ్లాలంటే ఇబ్బందులు పడేవాళ్లు. ఆ సమస్యలను అధిగమించాలని నగరం పరిశుభ్రంగా ఉండాలని 23 టాయిలెట్స్ పట్టణ ప్రగతిలో ఏర్పాటు చేశాం.  కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. టాయిలెట్ల ఏర్పాటుపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో మార్కెట్లు లేక రోడ్లపై అమ్మేవారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఏర్పాటు చేశాం. ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా పనిచేస్తున్నాం. ప్రజల జీవన శైలి ఆధునీకరణ జరిగింది. అన్ని రకాలుగా నగరం అభివృద్ధి చేస్తున్నాం. మాకు ఉన్న ఏడాదిన్నర సమయంలో ప్రజలు శభాష్ అనేలా అభివృద్ధి చేస్తాం. - - గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి 


తాగు, సాగు నీటి సమస్య తీరింది


ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి గంగుల కోరారు. కరీంనగర్ ఆరోగ్య నగరంగా ఉండాలని, అందుకు ప్రజలు సహకరించాలన్నారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూసుకోవాలన్నారు. తాను కేసీఆర్ అభిమానిని ఆయన ఆదేశాలను శిరసా వహిస్తానన్నారు. సీఎం కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తా అన్నారు. (మీరు ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు మంత్రి ఇలా సమాధానం ఇచ్చారు). కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశ వ్యాప్తంగా చర్చ ప్రారంభమయిందన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం లేక భరించాల్సి వస్తోందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న 50 పథకాలు దేశంలో ఎక్కడా లేవని మంత్రి అన్నారు. ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడంతో దిగుబడి పెరిగిందన్నారు.  తాగు, సాగు నీటి సమస్య తీరిందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలు అందరూ ఇదే చూస్తున్నారన్న ఆయన తమకు ఆ ఫలాలు కావాలని కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. 


8 ఏళ్లలో కేసీఆర్ అంటే ఏంటో చూశారు


80 ఏళ్లు పాలించిన వారి పాలనను ప్రజలు చూశారు. 8 ఏళ్లలో మా పాలన చూశారు. ఇక్కడ అభివృద్ధి తమ వద్ద కావాలని కోరుకుంటున్నారు. Ntr ఆనాడు ప్రారంభించిన్నపుడు 13 నెలల్లో ఆయనను చూసి అధికారం ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రజలు కేసీఆర్ పాలనను చూస్తున్నారు. కావాలని కోరుకుంటున్నారు. గుజరాత్ లో మహిళలు తాగు నీటికి, రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. ప్రజలు ఏది అయితే కోరుకుంటారో  కేసీఆర్ అదే చేస్తారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేసీఆర్ మాత్రమే. - గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి