Karimnagar News :రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య(85) ఇటీవల మృతి చెందారు. శుక్రవారం తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి కమలాకర్ ను పరామర్శించారు. గంగుల ఇంటికి వెళ్లిన బండి సంజయ్ మల్లయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. మంత్రి కమలాకర్ పరామర్శించారు. మల్లయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.
గంగుల కమలాకర్ కు పితృ వియోగం
తెలంగాణ బిసి సంక్షేమం, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో విషాదం అలుముకుంది. మంత్రి గుంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) ఇటీవల కన్నుమూశారు. కరీంనగర్ లోని వారి నివాసంలో గంగుల మల్లయ్య జనవరి 4న తుదిశ్వాస విడిచారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే మంత్రి గంగుల కమలాకర్ కార్యక్రమాలను రద్దు చేసుకుని కరీంనగర్ లోని తమ ఇంటికి చేరుకున్నారు. గంగుల మల్లయ్యకు నలుగురు కుమారులు కాగా, అందులో చిన్న కుమారుడు మంత్రి కమలాకర్.
సీఎం కేసీఆర్ పరామర్శ
మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గంగుల మల్లయ్య మరణవార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కు ఫోన్ చేసి పరామర్శించారు. విచారం వ్యక్తం చేశారు. తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న గంగులను సిఎం కేసీఆర్ ఓదార్చి, వారికి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భగవంతుడు గంగుల మల్లయ్యగారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.