Kalvakuntla Kavitha criticized Harish and Revanth: మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పక్కదారి పట్టించేందుకే గుంపు మేస్త్రీ ,గుంటనక్క కలిసి ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నారని కవిత తీవ్రంగా విమర్శించారు. పట్టణాల్లో జరిగే ఈ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆమె నిలదీశారు. ఈ రెండు పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయని, బాధితులకు ఈ విచారణల ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదని వ్యాఖ్యానించారు.

Continues below advertisement

అధికారంలోకి వస్తే అమరవీరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహణ తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముచ్చర్ల సత్యనారాయణ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ కూడా ట్యాంక్ బండ్ పై మన తెలంగాణ వారి విగ్రహాలు లేవు.  ఆంధ్రా నాయకుల విగ్రహాలు తీసేయమనటం లేదు. అవసరమైన నాడు తప్పకుండా తీసేద్దాం.  కానీ మన తెలంగాణ వారి విగ్రహాలు కచ్చితంగా ట్యాంక్ బండ్ పై ఉండాలన్నారు.   తెలంగాణ కోసం పోరాడిన ఎందరో అన్‌సంగ్ హీరోల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, తాము అధికారంలోకి వస్తే అమరవీరుడు శ్రీకాంతా చారి జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు.          

బీసీ రిజర్వేషన్లపై త్వరలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం         

Continues below advertisement

రాష్ట్రంలో జరిగిన కులగణనలో బీసీల సంఖ్యను తక్కువగా చూపి కాంగ్రెస్ మోసానికి పాల్పడిందని, కేంద్రం చేపట్టబోయే కులగణన ద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని కవిత పేర్కొన్నారు. బీసీ ఉపకులాలకు అన్యాయం జరగకుండా ప్రతి కులానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలంగాణ జాగృతి సేకరిస్తుందని, దీనిపై త్వరలోనే మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు మరియు యువత రాజకీయాల్లోకి రావాలని, వారికి జాగృతి తరపున పూర్తి మద్దతు ఇస్తామని ఆమె పిలుపునిచ్చారు. 

సికింద్రాబాద్ జిల్లా డిమాండ్  చేస్తున్న కేటీఆర్ పై కవిత సెటైర్లు                           

సికింద్రాబాద్ జిల్లా  ఏర్పాటు డిమాండ్‌పై స్పందిస్తూ, గత పదేళ్లుగా ఈ డిమాండ్‌ను అణిచివేసిన కేటీఆర్, ఇప్పుడు దాని గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు సికింద్రాబాద్‌ను జిల్లాగా చేయడంతో పాటు,  ప్రొఫెసర్ జయశంకర్  గారి పేరును ఒక జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఇంకా పూర్తిస్థాయిలో అవతరించకపోయినప్పటికీ, తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే వారికి అండగా ఉంటామని కవిత స్పష్టం చేశారు.