Jagtial Politics :  జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శ్రావణి రాజీనామా బీఆర్ఎస్ పార్టీలో  కలకలం రేపుతోంది. శ్రావణి రాజీనామా చేస్తూ స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను టార్గెట్‌ చేశారు.  మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశమవుతోంది.  జగిత్యాల జిల్లా మున్సిపల్‌ ఛైర్మన్‌ భోగ శ్రావణి ఆరోపణలపై ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ స్పందించారు. ఛైర్మన్‌ వ్యాఖ్యలు ఒకింత బాధ కలిగించాయన్నారు. శ్రావణి చేసిన ఆరోపణల వెనక విపక్షాల కుట్ర ఉందన్నారు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌. ఆమె ప్రెస్‌మీట్‌ను బీజేపీ ఎంపీలు.. ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అయితే, ఆమె రాజీనామాపై హైకమాండ్ దే తుది నిర్ణయం అని తెలిపిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌.. శ్రావణికి బీఫామ్ ఇచ్చిందే తానని అన్నారు. ‘చైర్‌పర్సన్‌ భోగ శ్రావణి ఆరోపణలు సమంజసం కాదు. ఆమెకు బీఫామ్‌ ఇచ్చిందే తానన్నారు.  అలాంటిది నేను ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాను. అవిశ్వాసం విషయంలో త‌న ప్రమేయం లేదు. ఈ విషయంలో ఇంతకుమించి స్పందించలేనని వ్యాఖ్యానించారు  


 అసలేం జరిగిందంటే ?


జగిత్యాల మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి బుధవారం బోగ శ్రావణి రాజీనామా చేశారు. మీడియా ముందు కంటతడి పెట్టిన ఆమె.. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ మహిళ ఎదగడం చూసి ఓర్వలేక ప్రతి తప్పుకు తనని బాధ్యుల్ని చేశారని శ్రావణి ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లను సైతం ఎమ్మెల్యే  సంజయ్ టార్చర్ చేశాడని ఆమె ఆరోపించారు. తనకు చెప్పకుండా  ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశాడని, తన పదవితో పోలిస్తే మున్సిపల్ చైర్మన్ పదవి చాలా చిన్నది అంటూ చాలాసార్లు  సంజయ్ అవమానించాడని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నా అభివృద్ధే లక్ష్యంగా తాను ముందుకు వెళ్ళానని శ్రావణి చెప్పారు.


ఎమ్మెల్యే సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి 


మీకు పిల్లలు ఉన్నారు.. వ్యాపారాలు ఉన్నాయి జాగ్రత్త అని బెదిరించారని...డబ్బులు కోసం డిమాండ్ చేసారు. మేము ఇచ్చుకోలేం అని చెప్పామమని అయినా వదిలి పెట్టలేదన్నారు.  దొర అహంకారం తో బీసీ బిడ్డ ఎదుగుతుందని ఓర్వలేక తనపై కక్ష కట్టారని బోగ శ్రావణి ఆరోపించారు. నరక ప్రాయంగా మున్సిపల్ చైర్మన్ పదవి ఉందని..  నడి రోడ్డుపై అమరవీరుల స్థూపం సాక్షిగా అవమానానికి గురయ్యాను అని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని అవమానాలు చేసినా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్ళాననన్నారు.   స్నేహితుడి కోసం జంక్షన్ చిన్నగా కట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అని.. మూడు సంవత్సరాలనుండి నరకం అనుభవిస్తున్నానని ఆమె విలపించారు.  
 
తప్పు జరిగిదే దిద్దుకుంటామని చెప్పినా వినలేదని కంటతడి 


తనకు అనుకూలంగా ఉన్న కొద్దీ మంది కౌన్సిలర్లకు టార్చర్ చూపించేవారు అనని.. మున్సిపల్ చైర్మన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందరి ముందు అవమానించే వారు అని ఆరోపించారు. బీసీ మహిళననే కక్ష గట్టారని సబ్బండ వర్గాలు రాజకీయాలకు పనికిరారా అని ఆవేదన వ్యక్తంచేశారు. పేరుకే మున్సిపల్ చైర్మన్ అయినా పెత్తనం అంతా ఎమ్మెల్యే దే అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసమే పని చేస్తామని పలుసార్లు వేడుకున్న కూడా  వినకుండా కక్ష గట్టారన్నారు  మమ్మల్ని అణచి వేసి ఈ రోజు జగిత్యాల ఎమ్మెల్యే గెలిచారనీ ...ఇదే విషయం అనేక సార్లు అడిగాం అనీ... తప్పు ఎక్కడ జరిగింది సర్దుకుంటాం అని అయినా కావాలనే కార్నర్ చేసారనీ ఆరోపించారు.ఎమ్మెల్సీ కవితను కలవకూడదని, కేటీఆర్ పేరు ప్రస్తావించకూడదని సంజయ్ కుమార్ హెచ్చరించారని శ్రావణి అన్నారు.  తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పొడపొడిగా స్పందించారు.