Intersting Conversation Between KTR And Rajagopal Reddy: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో గురువారం బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR), కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) మధ్య ఆసక్తికర చర్చ సాగింది. 'మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది.?' అని కేటీఆర్ అడగ్గా.. 'మీ లాగే మాకూ ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది.' అని రాజగోపాల్ రెడ్డి జవాబిచ్చారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. 'ఫ్యామిలీ పాలన కాదు. బాగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇక ఎంపీగా మీ కుమార్తె కీర్తి పోటీ చేస్తారా.? లేక కుమారుడు సంకీర్త్ పోటీ చేస్తారా.?' అని అడిగారు. దీనికి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. 'ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చెయ్యొద్దు. నన్ను వివాదాల్లోకి లాగొద్దు.' అని రాజగోపాల్ కోరారు.
మంత్రి పదవిపై
అసెంబ్లీ సమావేశాల అనంతరం శాసనసభ ప్రాంగణలో మీడియా ప్రతినిధులతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రి పదవిపై తనకు అధిష్టానం మాట ఇచ్చిందని.. హోంశాఖ ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. తాను హోం మినిష్టర్ అయితేనే బీఆర్ఎస్ నేతలు కంట్రోల్ లో ఉంటారని అన్నారు. 'కేసీఆర్ ను గద్దె దించేందుకే కాంగ్రెస్ లోకి వచ్చాను. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం. భువనగిరి, నల్గొండ లోక్ సభ స్థానాల్లో మా కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదనేది మా ఆలోచన. ఒకవేళ పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాం. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపిస్తాం.' అని పేర్కొన్నారు.
Also Read: Telangana Politics : కరీంనగర్‌లో దేవుడు చుట్టూ రాజకీయాలు - గంగులకు చెక్ పెట్టేందుకు పొన్నం ప్రయత్నం