రిమాండు రిపోర్టులో కీలక అంశాలివే!


TSPSC పేపర్ లీకేజ్ కేసులోని రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. ఇప్పటికి వరకు 12 మంది నిందితులను ఆరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. తొమ్మిది మంది నిందితులతో పాటు మరో ముగ్గురు అదుపులోకి తీసుకున్నారు అధికారులు.  ఆ ముగ్గురిలో ఇద్దరు TSPSC ఉద్యోగులే. వీరితో కలిపి ఇప్పటివరకు నలుగురు TSPSC ఉద్యోగుల అరెస్ట్ అయ్యారు.  వారిలో A1ప్రవీణ్ TSPSC సెక్రటరీ పీఏ, A2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్ : A10 షమీమ్ ASO, A12 రాజశేఖర్, డాటా ఎంట్రీ ఆపరేటర్.  


ఓ హోటల్లో జరిగిన డీల్ 


19మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. TSPSC ఉద్యోగి శంకర్ లక్ష్మి ని ప్రధాన సాక్షిగా చేర్చారు. శంకర్ లక్ష్మి తో పాటు TSPSC , తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులను కూడా సాక్షులుగా పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ యాజమని, అందులో ఉద్యోగిని కూడా సాక్షిగా చేర్చారు. హోటల్లోని సీసీటీవి కెమెరాలో పేపర్ మార్పిడి వ్యవహారం రికార్డయినట్టుగా సిట్ గుర్తించింది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ ను ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.


వందకు పైగా మార్కులు వచ్చిన 121 మంది గుర్తింపు


పేపర్ లీకేజ్ నిందితులకు గురువారం నాటికి పోలీస్ కస్టడీ విచారణ ముగిసింది. తాజాగా అరెస్ట్ చేసిన సురేష్, రమేష్, షమీమ్‌కి ఏప్రిల్ 4 వరకు జూడిషియల్ రిమాండ్ విధించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో షమీమ్‌కి 126 మార్కులు, రమేష్‌కి 120 మార్కులు వచ్చినట్లు గుర్తించారు. షమీమ్‌కి వాట్సాప్‌లో గ్రూప్ 1 పేపర్‌ రాజశేఖర్ రెడ్డి పంపాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి షమీమ్ ఇంట్లో సోదాలు చేసింది సిట్ బృందం. గ్రూప్-1 లో వందకు పైగా మార్కులు వచ్చిన 121 మందిని గుర్తించి.. అందులో కొందరికి నోటీసులిచ్చారు. ఇందులో కొందరు విదేశాల్లో ఉన్నట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి బంధువు న్యూజిలాండ్ నుంచి వచ్చి ఎగ్జామ్ రాసి వెళ్లినట్లు సిట్ గుర్తించింది. అతనితో పాటు ఇంకొంతమంది ఫారిన్ నుంచి వచ్చి పరీక్ష రాసి వెళ్లినట్లు సమాచారం. FSL రిపోర్ట్ కోసం సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు.


శంకర్‌ లక్ష్మి చెప్పిన ప్రకారమే కంప్యూటర్‌ హ్యాక్‌ 


మొత్తమ్మీద పేపర్ లీక్‌ వ్యవహారంలో కీలక సూత్రదారి రాజశేఖరే అని తేల్చింది సిట్. ఉద్దేశపూర్వకంగానే రాజశేఖర్‌ TSPSCకి డిప్యుటేషన్‌పై వచ్చాడని తేలింది. టెక్నికల్ సర్వీస్‌ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్ కంప్యూటర్‌ని హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ని దొంగిలించాడు. పాస్‌వర్డ్‌ని తాను ఎక్కడా రాయలేదని శంకర్‌ లక్ష్మి చెప్పింది అబద్ధమని తేలింది. శంకర్‌ లక్ష్మి చెప్పిన ప్రకారమే కంప్యూటర్‌ హ్యాక్‌ చేసినట్లు గుర్తించారు. పెన్‌డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేశాడు రాజశేఖర్. కాపీచేసిన పెన్‌డ్రైవ్‌ను ప్రవీణ్‌కు ఇచ్చాడు. AE పరీక్ష పత్రాన్ని ప్రవీణ్‌ రేణుకకు అమ్మాడు. ఫిబ్రవరి 27నే పేపర్‌ను రాజశేఖర్ కాపీ చేసనట్టు తేలింది. గ్రూప్‌-1 లో ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపైనా సిట్ విచారణ చేసింది.