ఇతరులు గద్దర్ కోసం ఏం చేశారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, కారు కూడా కొనిచ్చానని పవన్ వెల్లడించారు.
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Gaddar Daughter On Pawan Kalyan: గద్దర్‌ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై గద్దర్ కుమార్తె స్పందించారు. అంతకీ అప్పట్లో ఏం జరిగిందో అని ఏబీపీకి ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె వివరించారు.

- పవన్ గద్దర్‌కు కారు కొన్నాననడం బాధకలిగించిందని వెన్నెల తెలిపారు.
- మా నాన్నకు అలాంటి కారు కొనిచ్చినట్లు కుటుంబానికి తెలియదన్నారు.
- పవన్ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు.
- విధాన రూపకల్పనలో భాగమైతేనే సమాజం బాగుపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Gaddar Daughter On Pawan Kalyan: తెలంగాణలో తనను విమర్శిస్తున్న వారంతా గద్దర్ కోసం ఏం చేశారని ఈ మధ్య పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆయనతో తనకు చాలా సన్నిహిత సంబంధం ఉందని, చెప్పిన రెండు రోజుల్లోనే కారు కూడా కొని ఇచ్చానని వెల్లడించారు. దీనిపై ఆయన ఫ్యామిలీ స్పందించింది. గద్దర్ కుమార్తె వెన్నెల ఏబీపీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు.
ABP దేశం: పవన్ కల్యాణ్ ఆంధ్రా ప్రాంత నాయకుడు కాబట్టే ఇంత వివాదం చేస్తున్నారా? అదే తెలంగాణ నాయకుడైతే పాజిటివ్ గా స్పందించేవారు కదా? పవన్ వ్యాఖ్యలు ఎక్కడ బాధకలిగించాయి.?
వెన్నెల గద్దర్ , చైర్ పర్సన్ తెలంగాణ సాంస్కృతిక సారథి: నేను ఉన్నది ఉన్నట్లే మాట్లడా.. కండువా ఉన్నాలేకున్నా.. ఒకేలా మాట్లడతా.. ఈ విషయంలో ఆంధ్రా నుంచి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు. నేను బాబును కలసి గద్దర్ విగ్రహం పెట్టాలని రిప్రజంటేషన్ రాశాను. ఓఎస్‌డీ పవన్‌కు చెప్పారో లేదో తెలియదు. ఇక్కడ తెలంగాణకు ఎందుకు రానివ్వరంటూ రెచ్చగొట్టే ధోరణిలో పవన్ మాట్లడారు. గద్దర్ గురించి పదేళ్లుగా మాట్లాడుతున్నారు. గద్దర్ పాట పవన్ పాడారు. వీడియో వైరల్ చేశారు. క్లోజ్ అన్నారు. ఆయన లెగసీని ఓటుగా మారింది. అన్న పేరు చెప్పాడని ఓటు వేశాం. జాయిన్ అయ్యామని చెప్పారు. కానీ ఇక్కడ నేనే ఇచ్చా.. మీరేమయ్యారు అనడం కరెక్ట్ కాదు. నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, బీఆర్ ఎస్, బీజేపి, సీపీఎం నేతలూ వచ్చారు. ప్రజాసంఘాల నేతలు వచ్చి కలిశారు. వాళ్లొచ్చి ధైర్యం చెప్పి వెళ్లారు. మీ అయ్య జాగీరా అని మాట్లడం సరికాదు. నాయకుడు అన్నప్పుడు మాటలు జాగ్రత పెట్టుకోవాలి. సమాజంలో తప్పుడు సంకేతం వెళుతోంది.
ABP దేశం: గద్దర్ నన్ను కలసి, తమ్ముడూ వెన్నులో బుల్లెట్ దిగింది. నడవలేకపోతున్నా అన్నారు. గద్దర్ కు కారు కొనిచ్చానని పవన్ చెప్పారు. పవన్ కొన్న కారు ఎక్కడుంది.?
వెన్నెల గద్దర్ : మా నాన్నకి పవన్ కొన్న కారు ఎక్కడుందో నాకూ తెలియదు. ఇంట్లో ఎవరికీ తెలియదు. గద్దర్ ఏం చేసినా ప్రజల కోసమే చేశారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న సెన్సిటివ్ రిలేషన్ ను బయట ఎలా మాట్లాడతారు. ఆయన కారు ఇచ్చుంటే ఇంట్లో మేమైనా వాడుకోవాలి. లేదా ఇంకెవరికైనా ఇచ్చి ఉంటారు. ఆయన జీవితపయనంలో ఒకరు నీళ్లు పొసారు. ఒకరు బువ్వ పెట్టారు. ఒకరు కాళ్లు నొచ్చితే కాళ్లు పట్టారు. ఒకరు పాట రాస్తే కోరస్ పాడారు. ఒకరు కన్నీళ్లు తుడిశారు. ఇవన్నీ బయటపెట్టలేదు ఎవరూ. ఆయన చాలా గొప్ప వ్యక్తి. తెలంగాణ ప్రైడ్ గద్దర్. ఆయన అడుక్కునే వ్యక్తి కాదు. చిన్నపిల్లాడు చాక్లెట్ కొనియ్యవా అనేంత ప్రేమ, చనువు. అలా వారిద్దరి మధ్య చనువును ఇలా తెలంగాణవాదం విషయంలో వాడుకోకూడదు. గద్దర్ ప్రజల కోసం ఎలా బతికారో, ఎన్నెన్ని త్యాగాలు చేశారో తెలగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు.
ABP దేశం: గద్దర్ ఆంధ్రా ప్రజలను ఉద్దేశించి ఎప్పుడూ తప్పుగా మాట్లడలేదు. కానీ ఇఫ్పుడు నేతలు ఇరు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నారని మీకు అనిపించడంలేదా..?
వెన్నెల గద్దర్ : తెలంగాణలో ఆంధ్రా, తెలంగాణ ప్రజలకు మధ్య గొడవలు లేవు. మా ఇంట్లో అరవై ఏళ్లుగా గుంటూరుకు చెందిన కుటుంబం జీవిస్తున్నారు. వారిని మా కుటుంబ సభ్యుల్లా గౌరవిస్తున్నారు. ఒకరికొకరు ప్రేమగా చిన్నమ్మగా, తమ్ముడుగా ఉంటాం. సొంత రక్తసంబంధంగా ఉంటాయి. తెలంగాణ పోరాటం దొరల దోపిడీకి వ్యతిరేకంగా , ఆంధ్రా పెత్తందార్లుకు వ్యతిరేకంగా సాగింది. ఇప్పుడు చూస్తే పాలకులు కొట్లాడుకుని, సామాన్య ప్రజల మధ్య విద్వేషాలు రేపుతున్నారు. కొన్ని శక్తులు ఇంకా విద్వేషాలు రెచ్చగొడతున్నారు. పవన్ మా అన్న. మా నాన్నగారికి, పవన్ అన్నకు మంచి అనుబంధం ఉంది. కానీ పవన్ చెప్పిన విధానం కొంచెం బాధగా అనిపించింది. ప్రజల్లోకి పాజిటివ్ గా ప్రేమగా చెబితే నెత్తిన ఎత్తుకుని మోస్తారు. నాన్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. అమ్మతో కూడా మాట్లడారు. ఇక్కడ వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న విషయాలు బయటకు వస్తే కొందరు నెగిటివ్ గా చూస్తారు.
ABP దేశం: గద్దర్ వారసురాలిగా ప్రత్యక్ష రాకీయాల్లోకి వచ్చారు, ఎలా ఉంది. ఎమ్మెల్యేగా మీ కల సాకారమవుతుందని భావిస్తున్నారా..?
వెన్నెల గద్దర్ : నేను ఎమ్మెల్యే అంటే నాకోసం కాదు. పాలసీ మేకింగ్ లో భాగం కావాలి. కన్నీళ్లు, కష్టాలు తెలిసిన మంచి వ్యక్తి , ఓ స్త్రీ ముందుకొచ్చి, నాయకత్వంలో ఉంటే సమాజం బాగుపడుతుంది. యుద్ధంలో ఉంటాం. యుద్దంలో గెలుస్తాము. గద్దర్ సమాధిని , ఆయన స్పూర్తితో ఎర్ర జెండా, పంచశీల జెండా వస్తుంది. నేషనల్ బర్డ్,యానిమల్, అమరవీరుల స్దూపం. చుట్టూ చెట్లతో ఆయనకు ఇష్టమైన ప్రకృతిని ప్రతిబించేలా నిర్మాణం అద్భుతంగా చేయిస్తున్నాం.
Frequently Asked Questions
ఇటీవల పవన్ కల్యాణ్ గద్దర్ గురించి ఏమని ప్రశ్నించారు?
పవన్ కల్యాణ్ గద్దర్‌కు కొనిచ్చిన కారు గురించి ఆయన కుమార్తె వెన్నెల ఏమన్నారు?
ఆ కారు గురించి తమ కుటుంబంలో ఎవరికీ తెలియదని వెన్నెల అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత విషయాన్ని బహిరంగంగా మాట్లాడటం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు గద్దర్ కుమార్తె వెన్నెలకు ఎందుకు బాధ కలిగించాయి?
పవన్ వ్యాఖ్యలు తెలంగాణకు రానివ్వరనేలా రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయని వెన్నెల అన్నారు. 'నేనే ఇచ్చా' అనే పవన్ మాటలు బాధ కలిగించాయని, నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
గద్దర్ ఆంధ్ర ప్రజల గురించి ఎప్పుడైనా తప్పుగా మాట్లాడారా? ప్రస్తుత ప్రాంతీయ విద్వేషాలపై వెన్నెల అభిప్రాయం ఏమిటి?
గద్దర్ ఎప్పుడూ ఆంధ్ర ప్రజల గురించి తప్పుగా మాట్లాడలేదు. పాలకులే కొట్లాడుకొని, సామాన్య ప్రజల మధ్య విద్వేషాలు రేపుతున్నారని వెన్నెల అభిప్రాయపడ్డారు.
గద్దర్ కుమార్తె వెన్నెల రాజకీయ లక్ష్యాలు ఏమిటి?
పాలసీ మేకింగ్‌లో భాగం కావాలని వెన్నెల ఆకాంక్షిస్తున్నారు. కష్టాలు తెలిసిన మహిళ నాయకురాలు సమాజాన్ని బాగుచేయగలరని ఆమె విశ్వసిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















