Hyderabad Latest News: హైదరాబాద్‌లోని దూలపల్లి పారిశ్రామికవాడ అగ్ని ప్రమాదంలో నిర్లక్ష్యం ఎవరిది? అధికారులదా? కంపెనీదా?
Hyderabad Latest News: సరియైన ఫైర్ సేఫ్టీ లేకపోవడమే హైదరాబాద్‌లోని దూలపల్లి పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదానికి కారణమా?. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణ లోపం కూడా ఉందా.

Hyderabad Latest News: హైదరాబాద్ శివారులోని పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి పారిశ్రామిక వాడలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రౌన్ పాలిమర్ పరిశ్రమలో షాట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలం చేరుకొని మంటలను 10 గంటలు శ్రమించి 5 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. సరియైన ఫైర్ సేఫ్టీ లేకపోవడమే? ఇంతటి పెద్ద అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. 5 ఫైర్ ఇంజిన్లు, ఒక రోబో మిషన్, 2 అంతస్తులకు ఫైర్ అంటుకోవడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సహకారంతో మంటలు ఆదుపులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. క్రౌన్ పాలిమర్ పరిశ్రమకు సరైన ఫైర్ సేఫ్టీ లేకపోవడమే ఈ అగ్ని ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన బిల్డింగ్ స్టీల్ ప్లేస్ త్రీ ఫ్లోర్స్ ఉండడం పైప్ లైన్‌తో ఉండాల్సిన ఫైర్ సేఫ్టీ నామమాత్రపు అనుమతులతో ఈ పరిశ్రమ నడుస్తున్నట్టు సమాచారం.

అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం:స్థానికులు
జీడిమెట్ల పారిశ్రామిక వాడ మరియు దూలపల్లి పారిశ్రామికవాడలో అనేక కంపెనీలలో కంపెనీకి తగ్గట్టుగా సరియైన ఫైర్ సేఫ్టీ లేకపోవడం ఇలాంటి భారీ అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తారని ఫైర్ అధికారులపై ఫైర్ అవుతున్నారు. తర్వాత వెళ్లిపోతారని పట్టించుకోరని అంటున్నారు. కొన్ని కంపెనీలకు ఫైర్ ఎన్ఓసీలు లేకుండా కూడా నడిపిస్తున్నారు. అగ్ని ప్రమాదాలకు సంబంధించిన ఘటనలు అనేకంగా జరిగిన అటు అధికారులు కావచ్చు ఇటు కంపెనీ యాజమాన్యాలు కావచ్చు తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ అగ్ని ప్రమాదాలకు కారణమని స్థానికులు తెలిపారు.

ఒక కంపెనీ ప్రారంభిస్తున్నారు అని అంటే కంపెనీకి సంబంధించిన ఎన్వోసీలు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ వచ్చి పరిశీలించాలి. ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు సరిగ్గా చేయకపోవడమే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అుతున్నాయని స్థానికులు తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ప్రమాదాలు జరిగినప్పుడే వచ్చి హడావుడి చేయడం షరా మామూలుగా మారింది. క్రౌన్ పాలిమర్ కంపెనీల్లో ఆస్తి నష్టమే జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణాష్టం జరగలేదు. ప్రాణనాష్టం జరిగితే సంబంధిత అధికారులు బాధ్యత వహిస్తారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా కంపెనీల్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఉంది? కంపెనీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా ఉన్నాయా లేవా అని అధికారులు వచ్చి తరచూ తనిఖీలు నిర్వహిస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. క్రౌన్ పాలిమర్ కంపెనీ పైన సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే మరి.





















