Mastan Sai Lavanya Case : మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్‌- సంచలన విషయాలతో రిమాండ్‌ రిపోర్టు 

Mastan Sai Lavanya Case : లావణ్యపై హత్యాయత్నం చేసిన మస్తాన్ సాయిపై మరో కేసు నమోదు అయింది. అతని వద్ద ఉన్న హార్డ్‌ డిస్క్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Continues below advertisement

Mastan Sai Lavanya Case : డ్రగ్స్‌ ఇవ్వడం అపస్మారక స్థితిలో ఉన్న వారిని నగ్నంగా వీడియోలు తీసి తర్వాత బెదిరింపులకు దిగడంలో మస్తాన్ సాయి ఆరితేరిపోయినట్టు పోలీసులు తేల్చారు. ఇప్పటి వరకు నమోదు చేసిన కేసులకు మాదకద్రవ్యాల కేసు కూడా యాడ్ అయింది. అరెస్టు తర్వాత జరిపిన పరీక్షల్లో మస్తాన్‌ సాయికి పాజిటివ్‌ వచ్చింది. లావణ్య ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. 

Continues below advertisement

మస్తాన్‌ సాయిది గుంటూరు జిల్లా. అసలు పేరు రవి బావాజి మస్తాన్‌రావు. 2022 నుంచి లావణ్యతో పరిచయం ఉంది. తన చుట్టూ ఉండే యువతకు పార్టీలు ఇచ్చే మస్తాన్ సాయి ఓసారి లావణ్యను కూడా పిలిచాడు. ఆమెతో మద్యం తాగించి నగ్న వీడియోలు రికార్డు చేశాడు. వాటిని చూపించి ఆమెను వశపరుచుకోవడానికి యత్నించాడు. ఈ విషయంపై అప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్న రాజ్‌తరుణ్‌కు లావణ్య ఫిర్యాదు చేసింది. 

మస్తాన్‌ సాయితో రాజ్‌తరుణ్ మాట్లాడి ఆ వీడియోలు డిలీట్ చేశాడు. 2023లో సోదరి వివాహానికి లావణ్యను పిలించిన మస్తాన్ సాయి అక్కడ లైంగిక దాడి చేశాడు. దీనిపై లావణ్య ఫిర్యాదు చేసింది. కొన్ని రోజుల తర్వాత డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి దొరికిపోయాడు. అప్పుడు లావణ్య పేరును చెప్పాడు. స్నేహితురాలి విషయంలో లావణ్యపై దాడి చేశాడు. ఆ దాడి  ఘటనపై కూడా కేసు నమోదు అయింది. 

Also Read: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

నార్సింగ్ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు అయిన ఈ కేసు విషయంలోనే ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. తన ఇంటికి పిలిచి కేసు వాపస్ తీసుకోవాలని బెదిరించాడు మస్తాన్ సాయి. ఈ క్రమంలోనే అతని వద్ద ఉన్న కీలకమైన హార్డ్ డిస్క్‌ను లావణ్య తీసుకుంది. అందులో చాలా మంది నగ్న వీడియోలు, మందు, డ్రగ్స్ పార్టీ వీడియోలు ఉన్నాయి. 

5టీబీ కెపపాసిటీ ఉన్న హార్డ్ డిస్క్‌ పోలీసులకు చిక్కితే తన గుట్టు అంతా బయటకు వస్తుందని గ్రహించిన మస్తాన్ సాయి దాని కోసం ఈ ఫిబ్రవరి రెండో తేదీ రాత్రి లావణ్య ఇంటికి వెళ్లాడు. ఆమపై హత్యా యత్నం చేశాడు. ఇంట్లో వారి సహాయంతో హార్డ్ డిస్క్‌తో బయటపడ్డ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయిపై ఫిర్యాదు చేసింది. 

లావణ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు తర్వాత చేసిన పరీక్షలు కాకుండా డ్రగ్స్‌ టెస్టు కూడా చేయించారు. దీంతో అతనికి పాజిటివ్ వచ్చింది. అతని ఫ్రెండ్‌ ఖాజాకు కూడా పాజిటివ్ వచ్చింది. మస్తాన్ సాయి ఇప్పటికే మోకిల, విజయవాడలో డ్రగ్స్‌తో దొరికిపోయాడు. ఇప్పుడు మూడోసారి కూడా డ్రగ్స్ వాడినట్టు తేలింది.  

ఈకేసులో కీలకంగా మారిన హార్డ్ డిస్క్‌ ఓపెన్ చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో మందుపార్టీలు, డ్రగ్స్ వాడుతున్న యువత వీడియోలతోపాటు మత్తులో ఉన్న వారి నగ్న దృశ్యాలు కూడా ఉన్నట్టు తేలింది. అలాంటి వీడియోను మస్తాన్ సాయి వారికి చూపించి యువతులను లోబరుచుకున్నాడని అంటున్నారు.

ఇంత గుట్టు హార్డ్ డిస్క్‌లో ఉన్నందునే లావణ్యను చంపేందుకు యత్నించాడని తేల్చారు పోలీసులు. లావణ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పుడు డ్రగ్స్‌లో కూడా దొరికినందున ఎన్డీపీఎస్‌ సెక్షన్‌ను కూడా యాడ్ చేశారు.

Also Read: మస్తాన్ సాయి-లావణ్య వ్యవహారంలో విస్తుపోయే నిజాలు బయట పెట్టిన శేఖర్ బాషా... 300 ప్రైవేట్ వీడియోలపై రియాక్షన్ విన్నారా?

Continues below advertisement