సరోజిని నాయుడు 1829 ఫిబ్రవరి 13న జన్మించారు. ఆమె భారత స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి.
Sarojini Naidu Birthday: సరోజిని నాయుడికి జిన్నాతో స్నేహం ఎలా కుదిరింది? తర్వాత ఫైట్‌కు కారణమేంటీ?
Sarojini Naidu Birthday: సరోజినీ నాయుడు జయంతిని ఫిబ్రవరి 13న జరుపుకుంటారు. ముహమ్మద్ అలీ జిన్నాతో ఆమెకున్న స్నేహం, తరువాత ఎలా ఫైట్‌గా మారిందో చూద్దాం.

Sarojini Naidu Birthday: భారత్ నైటింగేల్ అని ముద్దుగా పిలుచుకునే సరోజిని నాయుడు 1829 ఫిబ్రవరి 13 నాడు జన్మించారు. ఆమె కవయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు, స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత క్రియాశీలంగా పాల్గొన్నారు. 1925లో, ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా కూడా పనిచేశారు. మొహమ్మద్ అలీ జిన్నాతో ఆమెకున్న స్నేహం స్వాంతంత్య్రానికి ముందు దేశంలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. కాలక్రమేణా ఆ స్నేహం చీలికకు దారితీసింది.
ప్రారంభంలో స్నేహం
సరోజినీ నాయుడు, జిన్నా మొదటిసారి 1906లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో కలిశారు. ఆ సమయంలో, జిన్నాను మితవాద జాతీయవాద నాయకుడిగా పరిగణించేవారు. రాజ్యాంగ సంస్కరణలు, హిందూ-ముస్లిం ఐక్యతను జిన్నా విశ్వసించారు. ఆయన వాక్చాతుర్యాన్ని, రాజకీయ స్పష్టత సరోజినీ నాయుడిని ఆకట్టకున్నాయి. వాటిని ఆమె ఎంతగానో మెచ్చుకున్నారు. 1916 చారిత్రాత్మక లక్నో ఒప్పందం తర్వాత, ఆమె జిన్నాను హిందూ-ముస్లిం ఐక్యతకు రాయబారిగా అభివర్ణించారు. 1918లో, ఆమె జిన్నా ప్రసంగాలను సంకలనం చేసి, ఆయనను ప్రశంసిస్తూ ఒక పుస్తకం రాశారు. వారి స్నేహం రాజకీయాలకే పరిమితం కాలేదు. సరోజినీ నాయుడు జిన్నా భార్య రతన్‌బాయి జిన్నాతో కలిసి తిరిగేవాళ్లు.
మహాత్మా గాంధీ ప్రభావం - రాజకీయ మార్పు
1920లలో మహాత్మా గాంధీ రాక, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం ఉద్యమాల కారణంగా వారిద్దరి స్నేహంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాంధీ పద్ధతులతో, ముఖ్యంగా రాజకీయాల్లో ఆయన వైఖరితో జిన్నా అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా ఆయన కాంగ్రెస్‌కు దూరమయ్యారు. మరోవైపు, సరోజినీ నాయుడు గాంధీకి అత్యంత విశ్వాసపాత్రులైన మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ఆయన ప్రచారాలలో చురుకుగా పాల్గొన్నారు.
జిన్నా చేపట్టిన ఉద్యమం ఆల్ ఇండియా ముస్లిం లీగ్‌తో కలిసి ప్రయాణించడం మొదలుపెట్టింది. రెండు దేశాల సిద్ధాంతాన్ని సమర్థించడం ప్రారంభించడంతో కాంగ్రెస్ నాయకులతో సైద్ధాంతిక విభేదాలు పెరిగాయి. విభేదాలు తీవ్రమయ్యాయి. సరోజినీ నాయుడు ఒకే దేశం నినాదాన్ని ఎత్తుకున్నారు. మత సామరస్యాన్ని విశ్వసించారు.
స్నేహం నుంచి దూరం దూరం
1940ల నాటికి పాకిస్తాన్ డిమాండ్ తీవ్రమయ్యే కొద్దీ సరోజినీ నాయుడు, జిన్నా మధ్య వ్యక్తిగత స్నేహం మరింత దూరమైంది. ఒకప్పుడు హిందూ-ముస్లిం ఐక్యతకు చిహ్నంగా ఉన్న స్నేహం ఇప్పుడు భారత రాజకీయాల్లోని బాధాకరమైన విభజనలతో పోరాడుతోందని అప్పట్లో కామెంట్స్ వచ్చాయి. అయితే, సరోజినీ నాయుడు ఎప్పుడూ జిన్నాను వ్యక్తిగతంగా ద్వేషించలేదు.
తుది విభజన తర్వాత
1947లో జరిగిన దేశ విభజన తర్వాత వారి రాజకీయ ప్రయాణం ముగిసింది. జిన్నా పాకిస్తాన్ వ్యవస్థాపక నాయకుడిగా మారారు. సరోజినీ నాయుడు భారత్‌లోనే ఉంటూ ఉత్తరప్రదేశ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
Frequently Asked Questions
సరోజిని నాయుడు ఎప్పుడు జన్మించారు?
భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు?
భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. ఆమె 1925లో ఈ పదవిని చేపట్టారు.
సరోజినీ నాయుడు, జిన్నా మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నారు?
సరోజినీ నాయుడు మరియు జిన్నా మొదటిసారి 1906లో కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో కలుసుకున్నారు.
సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్‌కు ఏ పదవిని చేపట్టారు?
సరోజినీ నాయుడు ఉత్తరప్రదేశ్‌కు మొదటి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. ఆమె స్వాతంత్ర్యం తర్వాత ఈ బాధ్యతను స్వీకరించారు.























