No AC campaign In Hyderabad: హైదరాబాద్‌లో ఈ మధ్య క్యాబ్‌ల వాళ్లు ఏసీ ఆన్‌ చేయడం లేదు. ఎందుకని అడిగితే ఓ నో ఏసీ క్యాంపెయిన్ గురించి చెబుతున్నారు. దీని గురించి వివరిస్తూ పోస్టర్లు కూడా క్యాబ్‌లకు తగిలిస్తున్నారు. ఏసీ వేయని అడగొద్దని తమకు రేట్లు గిట్టుబాటు కావడంలేదని అంటున్నారు. 


ప్రస్తుతం ఉబర్, ఓలా, రాపిడోలో అద్దెకు క్యాబ్‌లు తిప్పుతున్న డ్రైవర్లు ఏసీ లేకుండానే క్యాబ్‌లు రన్ చేస్తున్నారు. ఆయా సంస్థలు ఇస్తున్న రేట్‌లు చాలా తక్కువ ఉన్నాయని... ఏసీతో క్యాబ్ నడిపితే మైలేజీ తగ్గిపోతుందని అంటున్నారు. వేసవిలో కచ్చితంగా కిలోమీటర్‌కు ఇచ్చే రేట్‌ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. 




తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ ఈ క్యాంపెయిన్ మొదలు పెట్టింది. ఎవరైనా సరే క్యాబ్ బుక్ చేసుకుంటే ఏసీ ఆఫ్‌ చేసే సర్వీస్ ఇస్తున్నారు. ఏసీ ఆన్ చేయమని చెబితే ఎక్స్‌ట్రా రేట్‌ చెబుతున్నారు. రైడ్‌లో అలాంటివి లేవని వాదిస్తే... ఆయా సంస్థలు ఇస్తున్న రేట్‌కు ఏసీతో కారు నడిపితే ఏ మాత్రం గిట్టుబాటు కాదని అంటున్నారు. 



ప్రస్తుతం ఆయా సంస్థలు కిలోమీటర్‌కు పది నుంచి పన్నెండు రూపాయుల మాత్రమే ఇస్తున్నాయి. తాము ఏసీతో కార్లు నడిపితే కిలోమీటర్‌కు 16 నుంచి 18 రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంటే సగానికిపైగా తాము నష్టపోవాల్సి వస్తుందని TGPWU సభ్యులు వాపోతున్నారు. అందుకే నో ఏసీ క్యాంపెయిన్ రన్ చేస్తున్నామన్నారు. 


కిలోమీటర్‌కు లెక్క కట్టే ఇస్తున్న ఉబర్, ఓలా, రాపిడో సంస్థలు తమ వాహనాల నిర్వహణకు, ప్యూయెల్ ఖర్చు కూడా ప్రొవైడ్ చేయడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. 



కొంతమంది వినియోగదారులు ఏసీ వేయాల్సిందేనంటున్నారు. మరికొందరు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇంకొందరు టిప్‌ రూపంలో ఏసీకి అయ్యే అమౌంట్ ఇస్తాం వేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. 


ఈ సమస్యను ప్రభుత్వానికి ప్లాట్‌ఫామ్ కంపెనీలకు చెప్పామని వారు పట్టించుకోకపోవడంతోనే నో ఏసీ క్యాంపెయిన్ రన్ చేయాల్సి వస్తుందని అంటున్నారు TGPWU సభ్యులు,