TSPSC Paper Leak Latest News:  తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ రెండో రోజు ముగిసింది. హిమాయత్ నగర్ సిట్ కార్యాలయంలో శనివారం తొలిరోజు నిందితులను విచారించగా.. ప్రశ్నాపత్రాలు ఎలా కొట్టేశారు, పాస్ వర్డ్ ఎలా రాజశేఖర్ చేతికి వచ్చిందనే విషయంపై సిట్ ప్రశ్నలకు నిందితులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. అయితే రెండోరోజైన ఆదివారం విచారణలో సిట్ అధికారులు నిందితుల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు నిందితుడు రాజ శేఖర్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. 


టీఎస్ పీఎస్సీ ఆఫీస్ టైమ్ ముగిశాక సైతం ప్రవీణ్, రాజశేఖర్ అక్కడే గడుపుతూ ప్రశ్నాపత్రాలను సేకరించినట్లు గుర్తించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సిట్ కార్యాలయంలో రెండో రోజు విచారణ ముగిసింది. సిట్ చీఫ్ ఏ ఆర్ శ్రీనివాస్.. రెండు గంటల పాటు ముగ్గురు నిందితులను విడివిడిగా & మరొసారి ముగ్గురిని కలిపి ప్రశ్నించారు. క్వశ్చన్ పేపర్స్ ఎలా లీక్ చేశారు ? విరి వెనుక ఎవరున్నారు. ఆర్ధిక లావాదేవీలు ఎలా జరిగాయనే అంశాలపై నిందిదులను సిట్ ప్రశ్నించింది. ఐపీ అడ్రస్ లు మార్చేసి, కంప్యూటర్ లోకి లాగిన్ అయి క్వశ్చన్ పేపర్స్ దొంగిలించినట్లు తెలిపాడు రాజ శేఖర్. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సిస్టం అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లను విచారించి టెక్నికల్ టీం సహాయంతో  పలు కీలక విషయాలు ఎసిపి ప్రసాద్ రాబట్టినట్లు తెలుస్తోంది.   


నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకున్న సిట్ 
రాజశేఖర్, ప్రవీణ్, రేణుక , డాక్యా, రాజేశ్వర్, గోపాల్, రాజేంద్ర, నిలేష్, శ్రీనివాస్ విరి పాత్రలపై సిట్ అధికారులు వాంగ్మూలం రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. టెక్నికల్ విషయాలపై ప్రవీణ్, రాజశేఖర్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. రాజ్ శేఖర్ నుంచి ప్రవీణ్ కు అతడి నుంచి రేణుక ద్వారా క్వశ్చన్ పేపర్స్ చేతులు మారినట్లు స్టేట్ మెంట్ ఇచ్చారు నిందితులు. ఏఈ పరీక్ష పేపర్ తో పాటు టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నాపత్రాలను కాపీ చేసినట్లు నిందితుల స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది సిట్. అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏఓ పరీక్ష ప్రశ్నాపత్రాలను కూడా లీక్ చేశారు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి. మరోవైపు కాన్ఫిడెన్షియల్ ఆఫీసు నుంచి సీపీయూ హార్డ్ డిస్క్ లను సైబర్ క్రైమ్ ఏసిపి ప్రసాద్ పరిశీలించారు. 


టీఎస్పీఎస్సీ కార్యాలయంలో రాజశేఖర్, ప్రవీణ్ చేసిన అక్రమాలు చూసి ఉన్నత అధికారులు సైతం విస్తుపోతున్నారు. టౌన్ ప్లానింగ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందన్న ఫిర్యాదు మేరకు అధికారులు దర్యాప్తు చేయగా ప్రవీణ్ వ్యవహారం బయటపడింది. తన స్నేహితురాలు రేణుక అభ్యర్థన మేరకు మిత్రుడు రాజశేఖర్ తో కలిసి ఏఈఈ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారన్నదంతా అబద్ధమని తేలింది. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేవలం ఏఈఈ పరీక్షకు మాత్రమే పరిమితం కాలేదని, అలా నమ్మించేందుకు మాత్రమే రేణుక ప్రస్తావన తెచ్చాడని తేలింది. వాస్తవానికి మిగతా ప్రశ్నాపత్రాలనూ ప్రవీణ్, రాజశేఖర్ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది.