TRS MLAs Buying Issue: టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం జరిగింది. అంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (MLA Rohit Reddy) - నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి (Ramachandra Bharati) ఫోన్ లో మాట్లాడుకున్న ఓ ఆడియో టేపు బయటికి వచ్చింది. ఇది బయటికి రావడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. అందులో ప్రలోభాలకు సంబంధించి వారు మాట్లాడుకున్నట్లుగా ఉంది. మొత్తం ఆడియో టేపులో చాలా వరకూ ఇన్‌డైరెక్ట్ గానే ఇద్దరి సంభాషణ జరిగింది. డబ్బుల ప్రస్తావన ఎక్కడా రాలేదు. ఆసక్తి చూపుతున్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పాలని రోహిత్ రెడ్డి (MLA Rohit Reddy) ని రామచంద్ర భారతి (Ramachandra Bharati) కోరగా, ఇప్పుడు తాను చెప్పనని.. నేరుగా కలిసినప్పుడు చెబుతానని అన్నారు.


MLA Rohit Reddy Ramachandra Bharati Audio Tape: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - రామచంద్ర భారతి ఫోన్ సంభాషణలోని కీలక వివరాలు:


రోహిత్ రెడ్డి: స్వామీజీ మాట్లాడండి
రోహిత్ రెడ్డి: మీరు ఎలా ఉన్నారు
రామచంద్ర భారతి: నేను బాగున్నాను.
రామచంద్ర భారతి: నందుగారూ వారితో చర్చలు నడుస్తున్నాయి.. కొంచెం డీటైల్ గా మాట్లాడదామా?
రామచంద్ర భారతి: మీరు అతని పేరు చెప్పినట్లయితే నాకు సులువు అవుతుంది.
రోహిత్ రెడ్డి: పేరు చెప్పడం చాలా కష్టం. నాకు ఇద్దరు కన్ఫర్మేషన్ ఇచ్చారు. కలిసినప్పుడు మాట్లాడదామా స్వామీజీ?
రామచంద్ర భారతి: నేను 26వ తారీఖు వరకూ బెడ్ రెస్ట్ లోనే ఉంటాను. అప్పటిదాకా నేను రాలేను. 26 తర్వాత నేను రానా? హైదరాబాద్ లో కాకుండా ఇంకెక్కడైనా కలుద్దాం.
రోహిత్ రెడ్డి: ప్రస్తుతం ఉప ఎన్నిక నడుస్తుంది స్వామీజీ.. మాపైన కూడా నిఘా ఉంది. మేమంతా హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి.. హైదరాబాద్‌లో కలవడమే బెటర్.
రామచంద్ర భారతి: ఓకే.. అయితే సరే..
రోహిత్‌ రెడ్డి: ప్రస్తుతం మేం ముగ్గురం రెడీగా ఉన్నాం.
స్వామీజీ: మీరు నెంబర్‌-2 ముందు ఎమ్మెల్యేల పేర్లు చెప్తారా?
రోహిత్‌ రెడ్డి: నెంబర్‌ 2 ముందు పేర్లు చెప్తాను. కానీ, స్వామీజీ మీకు ఓ చిన్న రిక్వెస్ట్. ఈ విషయం కాన్ఫిడెంట్‌గా ఉంచండి.. లేదంటే లేదంటే మా పని అయిపోతుంది. మా సీఎం గురించి మీకు తెలుసు కదా.. ఆయన చాలా దారుణంగా ఉంటారు.
స్వామీజీ: బీఎల్‌ సంతోష్‌ మా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ. బీజేపీలో ఇలాంటి వ్యవహారాలు ఆయనే చూస్తారు. ఏ నిర్ణయమైనా సంతోషే తీసుకుంటారు. నెంబర్‌-1, నెంబర్‌-2.. బీఎల్‌ సంతోష్‌ ఇంటికి వచ్చి అన్నింటిపై చర్చించాలి. సంతోష్ వారి ఇంటికి వెళ్లి మాట్లాడరు. అది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రొటోకాల్.
రోహిత్‌ రెడ్డి: స్వామిజీ మీరు క్లారిటీ తీసుకోండి.. నేను మరికొంత మందికోసం ప్రయత్నిస్తా..
రోహిత్‌ రెడ్డి: దయచేసి ఇదంతా టాప్‌ సీక్రెట్‌గా ఉంచండి.. లేదంటే నాపని అయిపోతుంది.
స్వామీజీ: ఏమైనా చిన్న తేడా వచ్చినా మేము చూసుకుంటాం. మేం సెంటర్ నుంచి పూర్తి సహకారం అందిస్తాం.
స్వామీజీ: ఈడీ నుంచి ఐటీ వరకు, మీ భద్రతను కూడా మేముచూసుకుంటాం. మీరంతా మా అండర్‌లో ఉన్నారు.. మీరేమి ఇబ్బంది పడొద్దు.