Hyderabad Traffic Diversions: నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
Hyderabad Traffic Diversions: సోమ, మంగళవారాల్లో చేప ప్రసాదం పంపిణీ ఉన్న కారణంగా హైదరాబాద్ లో నాంపల్లి వద్ద రెండు రోజులపాటు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు

Nampally Fish Prasadam Distribution | హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకుని నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం (ఖెయా 8) ఉదయం 6 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే భక్తులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.
చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి బస్సులు, వ్యాన్లలో వచ్చే వారు గాంధీభవన్ లేదా గృహకల్ప బస్టాప్‌ల వైపు నుంచి రావాలని పోలీసులు సూచించారు. అలాగే ఆటోల్లో వచ్చే భక్తుల సౌకర్యార్థం షెజాన్ హోటల్ వద్ద ప్రత్యేక అలైటింగ్ పాయింట్ (ఆటోలు ఆగే స్థలం) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాంపల్లి పరిసర రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు, సాధారణ ప్రయాణికులు ముందే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
నాంపల్లిలో 'చేప ప్రసాదం' పంపిణీ.. ట్రాఫిక్ ఆంక్షలు..
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) June 7, 2026
🔹 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ దృష్ట్యా సోమవారం ఉదయం 6 నుంచి మంగళవారం రాత్రి 8 వరకు ఆంక్షలు.
🔹 ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసుల… pic.twitter.com/SKPs4GoKwL
50 కిలోలతో ప్రారంభమై 5 క్వింటాళ్లకు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ప్రసిద్ధ ‘చేప ప్రసాదం’ పంపిణీకి సంబంధించి బత్తిని అనిరుధ్ గౌడ్ పలు ఆసక్తికర వివరాలు వెల్లడించారు. మొదట్లో కేవలం 50 కిలోలతో ప్రారంభమైన ఈ ప్రసాదం తయారీ, ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా 5 క్వింటాళ్లకు చేరుకుంది. ప్రారంభంలో చేప మందుగా పిలవబడిన ఇది, కాలక్రమేణా చేప ప్రసాదంగా ప్రసిద్ధి చెందింది. భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ సైతం దీని కోసం ఇక్కడికి వచ్చారని బత్తిని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.
Also Read: School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
ఈ ప్రసాదాన్ని మూడు రకాలుగా (చేపతో, బెల్లంతో, కార్తె మందుగా) అందిస్తారు. 2 నుండి 3 అంగుళాల కొరమీను చేప పిల్ల ద్వారా ఇచ్చే ప్రసాదం 10 గ్రాములు ఉంటుంది. 30 గ్రాములు ఉండే కార్తె మందును 45 రోజుల వ్యవధిలో (15, 30, 45 రోజుల్లో) మూడు డోసులుగా వాడాలి. చేపతో మింగడం ఇష్టం లేని వారికి బెల్లం ప్రసాదం ఇస్తారు, కానీ చేపతో తీసుకునేదే ఎక్కువ ఫలితాన్నిస్తుందని చెబుతారు. ప్రసాదం స్వీకరించే 2 గంటల ముందు, తీసుకున్న గంటన్నర తర్వాత వరకు ఎలాంటి ఆహారం లేదా నీరు తీసుకోకూడదు.
జూన్ 8 రాత్రి 9 నుండి చేప ప్రసాదం పంపిణీ
జూన్ 8వ తేదీ రాత్రి 9 నుండి ప్రారంభం కానున్న చేప ప్రసాదం పంపిణీ 9వ తేదీన కూడా కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని వందల సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రసాదంపై ప్రజలకు అపార విశ్వాసం ఉందని, ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తారని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన శాంతిభద్రతలు, అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























