(Source: ECI/ABP News/ABP Majha)
చిక్కుల్లో జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్- విచారణ ఆరునెలల్లో పూర్తి చేయాలని సుప్రీం డైరెక్షన్
ఒడిపోయినా మదన్ మోహన్ వెనక్కి తగ్గలేదు. బీబీపాటిల్‌పై పోరాటం ఆపలేదు.
జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ చిక్కులు తప్పేలా లేవు. ఆయన అభ్యర్థిత్వంపై పోరాడుతున్న కాంగ్రెస్ నేత మదన్ మోహన్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి అనుకున్నది సాధించారు. ఆయనపై విచారణకు ఆదేశాలు తెచ్చుకున్నారు.
జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన అఫిడవిట్ ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఆయన ఎన్నిక సమయంలో ఇచ్చిన అఫిడవిట్‌లో నేరాల ప్రస్తావ లేదని ఆరోపించారు కాంగ్రెస్ నేత మదన్ మోహన్. ఎన్నికల నియమాల ప్రకారం అఫిడవిట్‌లో నేరాల ప్రస్తావన లేకపోవడం చట్టవిరుద్దమని అన్నారు.
ఇదే ఆరోపణలతో గతంలో హైకోర్టులో కేసు వేశారు కాంగ్రెస్ నేత మదన్ మోహన్. కానీ దీన్ని విచారించిన హైకోర్టు కోర్టులో మెరిట్ లేదని కేసు కొట్టేసింది. అప్పట్లో ఈ కేసును న్యాయమూర్తి అభిషేక్‌రెడ్డి విచారించారు.
హైకోర్టు తీర్పుతో సంతృప్తి చెందని మదన్‌మోహన్ సుప్రీం కోర్టు తలుపు తట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు చివరకు విచారణకు ఆదేశించింది. పాటిల్ అభ్యర్థిత్వంపై అఫిడవిట్‌పై ఆరునెలల్లో విచారణ పూర్తి చేయాలని హైకోర్టును ఆదేశించింది.
పైన కాంగ్రెస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును పునపరిశీపన చేసి ఆరు నేలలలో వేగవంతం గా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సుప్రీంకోర్టు..
బిబి పాటిల్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయనపై ఉన్న నేరాలను అఫిడవిట్ లో పేర్కొనలేదని ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మదన్ మోహన్.
జహీరాబాద్‌లో మదన్ మోహన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే.. బీబీపాటిల్ టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేశారు. ఉత్కంఠ పోరులో బీబీపాటిల్ గెలిచి ఎంపిగా పార్లమెంట్‌కు వెళ్లారు. అప్పటి నుంచి మదన్ మోహన్ పోరాటం కొనసాగుతూనే ఉంది.