Telangana Latest News : గ్రీన్ ఎనర్జీపై తెలంగాణ కీలక నిర్ణయం- తరలిరానున్న భారీ పెట్టుబడులు

Telangana Latest News:తెలంగాణను గ్రీన్ పవర్ హబ్‌గా మార్చేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2030 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే టార్గెట్‌గా ముందుకు సాగుతోంది.

Continues below advertisement

Telangana Latest News: రాష్ట్రానికి తక్కువ ధరతో, కాలుష్యరహితంగా విద్యుత్ అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్ పవర్ పాలసీని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రీన్ పవర్ పాలసీకి పెట్టుబడుదారులు ముందుకు వస్తున్నారు. 80 వేల నుంచి లక్ష కోట్ల వరకు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కంపెనీలతో MOUలు చేసుకున్నట్టు తాజాగా డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

Continues below advertisement

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ రంగంలో అనేక మార్పులు వచ్చినప్పటికీ గత 10 ఏళ్లు ఈ రంగంలో ఒక పాలసీ లేదు. 2030 నాటికి 20వేల మెగావాట్లు, 2040 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగునుంది. ఇప్పటికే సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ వంటి విభాగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రీన్ పవర్‌లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు స్టాంప్ డ్యూటీని రియంబర్స్మెంట్ చేయడంతోపాటు, నాలా కన్వర్షన్ సులభతరం చేశారు. తెలంగాణలో రోజురోజుకు విద్యుత్తు డిమాండ్ ఊహించన రీతిలో పెరుగుతోంది. దానిని అందుకునేందుకు ప్రభుత్వ ఖాళి భూములతోపాటు దేవాదాయ శాఖ ఖాళీ భూముల్లో, సాగునీటి శాఖలో సోలార్, ఫ్లోటింగ్ సోలార్ ద్వారా గ్రీన్ పవర్ ఉత్పత్తికి ఇప్పటికే ప్రణాళికలలు సిద్ధం చేశారు. 

స్వయం సహాయక సంఘాల మహిళలతో వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి జెన్‌కోతో MOU చేసుకున్నారు. ప్రభుత్వ ఖాళీ భూములను స్వయం సహాయక సంఘాల మహిళలకు లీజుకు ఇచ్చి పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు. మహిళ సంఘాలు ఉత్పత్తి చేసిన విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం కొనడం ద్వారా మహిళలను ప్రోత్సహించడంతోపాటు రాష్ట్ర విద్యుత్ అవసరాలను సైతం తీర్చవచ్చని భావించారు. అంతేకాదు ఈ రంగంలో యువతను ప్రోత్సహించడంతోపాటు, ప్రభుత్వ ఉద్యోగాలు రానివారు బ్యాంకుల సహకారంతో స్వయం ఉపాధికి గ్రీన్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ గ్రీన్ పవర్ ఉన్నా అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇటీవల రాజస్థాన్ ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్‌లో టాక్స్ ఫ్రీ చేశారు. ఫలితంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాల అమ్మకాలు పెరిగాయి. దీనికి తోడు ఇటీవల దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చారు. వారు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు, ఆ సర్వే తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 8,938 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి జరుగుతుందని 2040 నాటికి 40వేల మెగావాట్లు రాష్ట్రంలో ఉత్పత్తి చేసే సంకల్పంతో ముందుకు సాగుతోంది రేవంత్ సర్కార్. దూర ప్రయాణం చేసే వారిని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ముందుకు వస్తే ఎలక్ట్రికల్ చార్జింగ్ స్టేషన్‌లు పెట్టుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. తీవ్ర వాతావరణ కాలుష్యం మూలంగా ఢిల్లీ పట్టణ ప్రజలు ఒక సీజన్‌లో మూడు నెలల పాటు వలస వెళ్లిపోతున్నారు. ఆ పరిస్థితి హైదరాబాద్‌కు రాకుండా చూడాలని ఎలక్ట్రికల్, బ్యాటరీ బేస్డ్ బస్సులు ప్రవేశ పెడుతూ, డీజిల్ బస్సులను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో కొత్తగా డీజిల్ ఆటోలకు అనుమతి ఇవ్వడం లేదు బ్యాటరీతో నడిచే ఆటోలను ప్రోత్సహిస్తున్నారు. కాలుష్య కారకాలను నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు వైపుకు తరలించాలనే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన గ్రీన్ పవర్ పాలసీకి సంబంధించిన పూర్తి సమాచారం ఆన్లైన్లో అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా అవగాహాన కల్పించేందుకు సిద్దమైయ్యారు.

Continues below advertisement