Telangana Phone Tapping Case Update: ఫోన్ ట్యాపింగ్ కేసు రోజురోజుకూ వెబ్‌సిరీస్‌కు ఏమాత్రం తక్కువ కాకుండా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. తాజాగా సిట్ విచారణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ట్యాపింగ్ సీన్ టూ సీన్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ట్యాపింగ్ విచారణలో ప్రభాకర్ రావు అమెరికా నుంచి రాకముందు వరకూ ఓ లెక్క, వచ్చాక ఇంకో లెక్క అన్నట్లుగా విచారణ ఆసక్తిగా మారింది. గత మూడు రోజుల నుంచి విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో, సిట్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వక పోవడంతో ఈరోజు నాల్గోసారి ప్రభాకర్‌ను విచారించింది సిట్ బృందం. ఇప్పటి వరకూ సిట్ విచారణలోొ నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. మౌనమే సమాధానంగా ప్రభాకర్ రావు మాత్రం నోరుమెదపడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే కేసులో మరో కీలక నిందితుడు సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు, ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలను ప్రభాకర్ రావు ముందుంచారు. ప్రభాకర్ రావు తీరులో మార్పు రాకపోవడంతో సుప్రీంకొర్టును ఆశ్రయించాలని సిట్ అధికారులు భావించినట్లు సమాచారం. ప్రభాకర్ రావుకు కల్పించిన వెసులుబాటును రద్దు చేయాలంటూ పిటీషన్ దాఖలు చేయనున్నారు. 

సీన్‌లోకి రివ్యూ కమిటీ 

తాజాగా సిట్ విచాణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.మావోయిస్టుల విస్తరిస్తున్నారనే సాకుతో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచే ట్యాపింగ్ బాగోతం మొదలుపెట్టారని తెలుస్తోంది. 2023 నవంబర్ 15వ తేది నుంచి తెలంగాణలో ప్రముఖ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసేందురు రివ్వూ కమిటీ వద్ద అనుమతులు తీసుకున్నారు., ఏకంగా 600 మంది వ్యాపారవేత్తలు, ప్రముఖులు, జర్నలిస్టులు, మీడియా సంస్దల యజమానులు  వారి కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లు ట్యాప్‌ చేశారని తెలుస్తోంది. దీంతో రివ్యూ కమిటీ సైతం సిట్ బోనులో నిలబడాాల్సిన పరిస్దితి వచ్చింది. మావోయిస్టుల సాకుతో ట్యాపింగ్ కు అనుమతులు ఎలా ఇస్తారంటూ రివ్యూ కమిటీని తాజాగా సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇలా తీగ లాగితే ట్యాపింగ్ డొంక వేగంగా  కదులుతోంది. 

ప్రణీత్‌రావు కీలక స్టేట్మెంట్

ఓవైపు నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు మరోవైపు సాక్షుల స్టేట్మెంట్స్ సైతం రికార్టు చేస్తున్నారు. ఇప్పటికే టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తోపాటు 25 మంది సాక్షులను విచారించారు. గత ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ప్రతిపక్షాలకు ఆర్దిక సహాయం చేసే వారి వివరాలు ప్రణీత్ రావుకు ప్రభాకరావు ఇచ్చేవారని అంటున్నారు. ప్రణీత్ రావు నుంచి భుజంగరావుకు ఆ నేతల వివరాలు వెళ్లేవి. భుజంగ రావు నుంచి బీఆర్‌ఎస్ పార్టీ నేతలకు సమాచారం వెళ్లేదని విచారణలో ప్రణీత్ రావు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆ తరువాత అప్పటి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకృష్ణంరావు రంగంలోకి దిగడం ,వారి ఆర్దిక మూలాలను టార్గెట్ చేసి దెబ్బకొట్టడం జరిగేదట. ఇలా ట్యాపింగ్ బాగోతం సాగినట్లు సిట్ విచారణలో వెలుగుచూసింది.

అన్ని మార్గాల్లో రైడ్ చేస్తున్న సిట్ 

ప్రభాకర్ రావు విచారణ తరువాత రివ్యూ కమిటీ తీరును అనుమానించిన సిట్ అధికారులు, రివ్వూ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐపిఎస్ అధికారులు అనిల్ కుమార్,జితేందర్ ఎందుకు అనుమతి ఇచ్చారు. 600 మంది లిస్ట్ ఇచ్చినప్పుడు ,పూర్తిగా నిర్దారణ చేసుకోకుండా, ట్యాపింగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక లోపాయికారి ఒప్పంద జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తోంది సిట్. ఇదిలా ఉంటే తాజాగా సుప్రీంను ఆశ్రయించడం ద్వారా ప్రభార్ రావు నుంచి వాస్తవాలు రాబట్టడం, మరోపైపు ఇప్పటి వరకూ విచారణలో జరిగిన పరిణామాలపై నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది.