News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

KTR: వచ్చే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు 3 వేలు అందిస్తాం: కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల కార్మికులను పై స్థాయిలోనిలబెట్టాలని కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మన్నెగూడలో జరిగిన జాతీయచేనేత దినోత్సవం 2023 వేడుకల్లో పాల్గొన్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల కార్మికులను పై స్థాయిలో నిలబెట్టాలని అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని మన్నెగూడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం 2023 వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేనేత కార్మికుల బాధలు ఎలా ఉంటాయనేది ముఖ్యమంత్రికి తెలుసని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్‌ కూడా పద్మశాలి కుటుంబంలో ఉండే చదువుకున్నారని..వారి సమస్యలన్ని కూడా ఆయనకు చిన్నతనం నుంచే తెలుసని ఆయన పేర్కొన్నారు. చేనేత కార్మికులకు ఈ సందర్భంగా ఆయన ఓ గుడ్ న్యూస్‌ చెప్పారు. '' చేనేత మిత్ర పథకంలో రాబోయే నెల నుంచి ప్రతి మగ్గానికి నెలకు 3 వేల చొప్పున ప్రతి కార్మికుడికి అందజేస్తామని తెలియజేశారు.

రైతులకు రైతు బీమా చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని ఈ సందర్భంగా కేటీఆర్‌ కొనియాడారు. 59 ఎళ్ల పైబడిన వారికి ప్రభుత్వమే బీమా ఇస్తుంది. ఇప్పటి వరకు రూ.40.50 కోట్లు ప్రైమ్‌ మగ్గాలు ఏర్పాటు కోసం అందిస్తామని ఆయన వివరించారు. ఒక్కొక్క మగ్గానికి 38 వేల రూపాయలు చొప్పున అందజేస్తున్నామని తెలియజేశారు. చేనేత కార్మికులకు ఐడీ కార్డులు ఇస్తున్నాం. టెస్కో ద్వారా వీవర్స్ మెంబర్స్‌ కు ఎక్స్‌ గ్రేషియా 25 వేలకు పెంచాం. నేత కార్మికుల కోసం గృహాలక్ష్మి తీసుకోస్తామని ఆయన వివరించారు. పని కోసం సూరత్‌ వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో పనులు ఇచ్చే వారిగా తిరిగి వచ్చారని ఆయన పేర్కొన్నారు. 

చేనేతపైన ప్రధాని మోడీ ఐదు శాతం జీఎస్టీ వేశారు. చేనేత వద్దు.. పథకాలు అన్ని రద్దు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం తీరు ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి అందులోని నాయకులకు నేత తెలియదు. నేతన్నల కష్టాలు తెలియదు. ఉప్పల్ బాగాయత్‌లో హ్యాండ్లుమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.. ఇప్పటికే శంకుస్థాపన చేశాం.. పోచంపల్లి హ్యాండ్లుమ్ పార్క్ రూ.12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నామని తెలిపారు.  

రానున్న రోజుల్లో కేంద్రంలో కచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది. అందులో మన ప్రభుత్వం ఉంటుంది. ప్రస్తుతం కేంద్రం రద్దు చేసిన కార్యక్రమాల్ని కూడా తీసుకువస్తాం. మీరందరూ కూడా పని చేసే  ప్రభుత్వానికి అండగా ఉండండి." అని కేటీఆర్ కోరారు.

Published at : 07 Aug 2023 05:42 PM (IST) Tags: Hyderabad KTR Telangana

ఇవి కూడా చూడండి

Telangana Congress: పూర్తయిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్, 60 శాతానికిపైగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఖరారు!

Telangana Congress: పూర్తయిన కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్, 60 శాతానికిపైగా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఖరారు!

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన

TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన

Rice sales Tenders: యాసంగి ధాన్యం విక్రయ టెండర్లు రద్దు చేసే ఛాన్స్‌- రూ.1000 కోట్ల నష్టం వస్తుండటంతో యోచన

Rice sales Tenders: యాసంగి ధాన్యం విక్రయ టెండర్లు రద్దు చేసే ఛాన్స్‌- రూ.1000 కోట్ల నష్టం వస్తుండటంతో యోచన

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

టాప్ స్టోరీస్

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

ఫోటోలు: తిరుమలలో ఐదో రోజు గరుడ వాహన సేవ, దర్శనం కోసం గ్యాలరీల్లో భక్తుల బారులు

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?

2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?